Advertisementt

చప్పుడు లేకుండా జిన్నా ఓటిటి రిలీజ్

Fri 02nd Dec 2022 11:09 AM
manchu vishnu,ginna streaming on amazon prime  చప్పుడు లేకుండా జిన్నా ఓటిటి రిలీజ్
Finally, Ginna gets its OTT release date చప్పుడు లేకుండా జిన్నా ఓటిటి రిలీజ్
Advertisement
Ads by CJ

మంచు విష్ణు కి చాన్నాళ్ళకి జిన్నాతో ఓ హిట్ పడింది. కొన్నేళ్లుగా హిట్ కొట్టాలని విష్ణు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి సక్సెస్ అనేది అందని ద్రాక్షలా తయారైన సమయంలో జిన్నా హిట్ మంచు ఫ్యామిలీకి ఊరటనిచ్చింది. మంచు మనోజ్ సినిమాలకి గ్యాప్ ఇవ్వడం, మోహన్ బాబు రీ ఎంట్రీ తో అంత సంతోషంగా లేకపోవడం, మధ్యలో మా ఎలక్షన్స్ తో మూటగట్టుకున్న నెగిటివిటీని దాటుకుని మంచు విష్ణు జిన్నా ప్రమోషన్స్ తో మెప్పించి బాక్సాఫీసు ఫైట్ కి దిగాడు. 

అయితే జిన్నా మూవీని సోలోగా రిలీజ్ చేసి ఉంటే.. హిట్ తో పాటుగా లాభాలు కూడా వచ్చేవి. కానీ నాలుగు సినిమాల్లో ఒకటిగా జిన్నా రిలీజ్ అవడంతో ప్రేక్షకుల నోట బావుంది అన్నా.. కాసులు గలగలలు వినిపించలేదు. ఇక దీనితో పాటు రిలీజ్ అయిన సినిమాలు ఎప్పటినుండో ఓటిటిలో సందడి చేస్తున్నా.. జిన్నా మాత్రం సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో గత అర్ధరాత్రి అంటే డిసెంబర్ 1 అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. 

బావుంది అన్న సినిమాకి ఎంతో కొంత పబ్లిసిటీ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఆదరించేవారు. ఇలా చప్పుడు లేకుండా ఓటిటిలోకి వచ్చేస్తే ఎవరు పట్టించుకుంటారనే కామెంట్స్ నెటిజెన్స్ నోటి నుండి వస్తున్నాయి.

Finally, Ginna gets its OTT release date:

Manchu Vishnu Ginna Movie Streaming on Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ