పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై బాలయ్య తో కనిపిస్తే స్టేజ్ దద్దరిల్లిపోవడం కాదు, అన్ స్టాపబుల్ యూజర్స్ ఆహా ఓటిటి ని షేక్ చేసి స్ట్రక్ చేస్తారు. బాహుబలి ప్రభాస్ తో బాలయ్య అబ్బ వినడానికే వినసొంపుగా ఉంది. ప్రభాస్ ఎలాంటి టాక్ షోలో పాల్గొన్నా బాలయ్య టాక్ షో కి వస్తే ఆ క్రేజే వేరు. ఆ అంచనాలు కొలమానంలో కొలవడం కూడా కష్టమే. మరి ప్రభాస్ నిజంగానే బాలయ్య అన్ స్టాపబుల్ కి వస్తాడా.. అసలు వచ్చే ఛాన్స్ ఉందా? ఇన్ని అనుమానాలు మదిలో మెదులుతున్నా.. వస్తే బావుంటుంది, ఆ ఎపిసోడ్ చూడడానికి ఎంతగా వెయిట్ చేస్తామో అంత కిక్ ఇస్తుంది, ఒక్కసారి ప్రభాస్ ని బాలయ్య తో చూడాలని ఉంది.. ఇది ప్రభాస్ ఫాన్స్, నందమూరి ఫాన్స్ కోరుకునేది. వాళ్ళే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారు.
కొంతమంది ప్రభాస్-బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లోడింగ్, డిసెంబర్ 31 న ఆహా వారు మ్యాజిక్ చెయ్యబోతున్నారంటుంటే, కొంతమంది ప్రభాస్ ఆహా టాక్ షోకా.. ఇదంతా జస్ట్ రూమర్ అని తేల్చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి ఆహా టాక్ షోకి వస్తాడనే ప్రచారమూ షురూ అయ్యింది. ప్రభాస్ -గోపీచంద్ మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి వస్తారనే నమ్మకాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అరవింద్ గారు మీరు వింటున్నారా.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో.. మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మీరు.. ఈ కాంబోని ఆహా స్టేజ్ పై చూపించండి అంటూ అప్పుడే అల్లు వారికి, ఆహా వారికి రిక్వెస్ట్ లు మొదలైపోయాయి.