బిగ్ బాస్ సీజన్ సిక్స్ 13 వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. నాగార్జున ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో రేవంత్ కూతురిని చూపించారు. తర్వాత ఉన్న ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ ఏ వారంలో తాము తప్పు చేశామని ఫీలయ్యామో చెప్పమని అడగ్గానే ఫైమా ఆరో వారంలో తప్పు చేసానని ఫీలవుతున్నా, ఆ వెటకారం ఎక్కువైంది అన్న తర్వాత కాస్త తగ్గాల్సింది అందుకే అంది. తర్వాత ఇనాయ స్ట్రాప్స్ పీకినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా ఉండాల్సింది అంది. శ్రీ సత్య 11వ వారంలో కీర్తి ని ఇమిటేట్ చేశాను. అది చెయ్యకుండా ఉండాల్సింది అంది. అదొక్కటేనా అని నాగర్జున రెట్టించారు. అవును అంది. శ్రీహన్ విషయంలో అని అడిగారు నాగ్, ఏం లేదు అంది. శ్రీహన్, రేవంత్ ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత మారిపోయారుగా అన్నారు నాగ్. అవును నేను పట్టించుకోలేదు, శ్రీహన్ నుండి నేనేమి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంది. అదే నేను అడిగాను అన్నారు నాగ్.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఓటింగ్ లో రేవంత్ టాప్ పొజిషన్ లో ఉండగా.. ఆది రెడ్డి ఒకరోజు, రోహిత్ ఒకసారి సెకండ్ పొజిషన్ లో ఉంటూ వచ్చారు. తర్వాత కీర్తి, శ్రీ సత్య, ఫైమా ఉన్నారు. డేంజర్ జోన్ లో శ్రీ సత్య, ఫైమా ఉండగా.. ఆదివారం ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ అయ్యినట్లుగా తెలుస్తుంది. గత వారమే ఫైమా ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. ఎవిక్షన్ ప్రీ పాస్ ఆమెని కాపాడింది. దానితో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక శ్రీ సత్య ఫైమా కన్నా ముందు వెళుతుంది అనుకుంటే.. ఫ్యామిలీ వీక్ ఆమెకి కలిసొచ్చి ఆమె సేఫ్ అయ్యింది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే అయితే శ్రీ సత్య కూడా ఫైమా వెనకే వెళుతుంది.
తర్వాత వారంలో మిగిలిన ఆది రెడ్డి, కీర్తి, రోహిత్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ప్రేక్షకుల్లో పిచ్చ క్యూరియాసిటీ అయితే ఉంది. 13 వ వారంలో ఫైనల్ గా ఫైమా ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది.