Advertisementt

బిగ్ బాస్ పూర్తికాకుండానే ఆఫర్ పట్టేసింది

Sun 04th Dec 2022 06:36 PM
avunu valliddaru ishtapaddaru,bigg boss vasanthi  బిగ్ బాస్ పూర్తికాకుండానే ఆఫర్ పట్టేసింది
Bigg Boss fame Vasanthi Krishnan is back on TV బిగ్ బాస్ పూర్తికాకుండానే ఆఫర్ పట్టేసింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గ్లామర్ గర్ల్ గా, అందాల రాణిలా మేపరిసిపోయి టాస్క్ విషయంలో మొదట్లో లైట్ తీసుకున్నా, తర్వాత వారాల్లో కాస్త పుంజుకుని, లక్కీ గా తొమ్మిదివారాలు హౌస్ లోనే కొనసాగిన వాసంతి బిగ్ బాస్ నుండి బయటికి రాగానే ఇంటర్వూస్ తో హడావిడి చేసింది. నాలుగైదు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే.. గ్లామర్ డాల్ గా ఆమె అందం ఆమెని కాపాడింది. బిగ్ బాస్ కి టాస్క్ లు ఆడవాళ్లే కాదు, కలరింగ్ ఇచ్చే అమ్మాయిలు కూడా కావాలి. అందుకే వాసంతిని కాపాడారు. లేదంటే గీతూ, సూర్య లాంటి వాళ్ళు హౌస్ నుండి ఎలిమినేట్ అయినా వాసంతి మాత్రం హౌస్ లోనే ఉంది. ఈ విషయంలో బిగ్ బాస్ పై తెగ ట్రోల్స్ నడిచాయి.

ఇక ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వూస్ ముగిసాక.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనిపించిన తర్వాత కొన్నాళ్ళకి స్టార్ మా ఛానల్ లోనే ఏవేవో ప్రోగ్రామ్స్ లో హంగామా చేస్తారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. కానీ వాసంతికి లక్కీ ఛానల్స్ తగిలింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన మూడు వారాల్లోపే ఆమెకి స్టార్ మా సీరియల్ ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు లో ఛాన్స్ వచ్చింది. స్టార్ మా త్వరలో ప్రసారం కాబోయే అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు  సీరియల్ లో వాసంతి అమాయకపు అమ్మాయిగా కనిపించబోతుంది. 

వాసంతి లక్కు మాములుగా లేదు, బిగ్ బాస్ సీజన్ 6 పూర్తి కాకూండానే సీరియల్ ఆఫర్ పట్టేసింది, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సీరియల్ బిగ్ బాస్ ముగిసిన తర్వాత స్టార్ మా లో ప్రసారం అవుతుంది అని తెలుస్తుంది. 

Bigg Boss fame Vasanthi Krishnan is back on TV:

Avunu Valliddaru Ishtapaddaru New Serial on Star Maa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ