బాలకృష్ణ బరిలోకి దిగితే శత్రు మూకకి ఊచకోతే అన్నట్టుగా బాలయ్య యాక్షన్ విన్యాసాలు ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ కోవలోకి చెందిన చిత్రాలే. ఇక మెగాస్టార్ చిరంజీవి మెగా స్టెప్స్ లో ఆయన డాన్స్ లో ఆయన్ని కొట్టేవారే లేరు. చిరు బ్రేక్ డాన్స్ ని మ్యాచ్ చేసే హీరో నే లేడు అనిపించేలా చిరు డాన్స్ ఉంటుంది. అందుకే బాలయ్య కూడా చిరంజీవి-బాలయ్య కాంబోలో సినిమా వస్తే చిరుకి డాన్స్ లు పెట్టి నాకు ఫైట్స్ పెట్టమని నిర్మొహమాటంగా అడుగుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి అల్లు అరవింద్-సురేష్ బాబు, కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు లు గెస్ట్ లుగా వచ్చారు.. రీసెంట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ లో అరవింద్-సురేష్ బాబు ముందుగా ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పైకి వచ్చారు. ఈ స్టేజ్ పైనే సురేష్ బాబు నిర్మాణ సంస్థలో మా సినిమాలు వచ్చాయి.. మరి గీత ఆర్ట్స్ లో మా సినిమా ఎప్పుడు అని అరవింద్ ని అడిగితే.. అరవింద్ గారు చిరుతో-మీతో కలిసి మల్టీస్టారర్ ప్లాన్ చేద్దామనుకుంటున్నా.. దాని కోసమే వెయిటింగ్ అంటూ ప్రోమోలోనే ఆసక్తి క్రియేట్ చేసారు.
దానికి బాలయ్య అది మల్టీస్టారర్ ఏమో కానీ పాన్ వరల్డ్ మూవీ అవుతుంది అంటూ ఫన్ చేస్తూనే మా ఇద్దరిని కలిపి సినిమా చేస్తే నాకు ఫైట్స్ పెట్టి, చిరంజీవికి డాన్స్ లు ఇవ్వండి అంటూ కామెడీ చేసారు. అలాగే ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు తో బాలయ్య నేను నా మనసుకి తోచిన ప్రశ్నలు అడుగుతాను, అరవింద్ గారు అడగమనలేదు, ఆయనకి ఈ ప్రశ్నలతో ఎలాంటి సంబంధం లేదు అనగానే అడగండి అంటూ సురేష్ బాబు సమాధానాలు చెప్పడానికి రెడీ అయ్యారు.