ఈమధ్యన సెలబ్రిటీస్ ఎక్కడో దూరంగా వివాహం చేసుకుని వారి పెళ్లి వీడియోస్, ఫొటోస్ చూడాలంటే ఫలానా ఓటిటి సంస్థ నుండే వీక్షించాలంటూ ప్రేక్షకులని, అభిమానులని ఊరిస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్, రీసెంట్ గా నయనతార, మొన్న హన్సిక అలానే తమ పెళ్లిని ప్యాలెస్ లో చేసుకుని ఆ రైట్స్ ని ఓటిటీలకి కట్టబెట్టారు.
ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్. సిద్దార్థ్ మల్హోత్రా తో డేటింగ్, ప్రేమాయణం నడుపుతున్న కియారా అద్వానీ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయట. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటారని అనుకున్నప్పటికీ.. వచ్చే ఏడాది అంటే 2023 లో బాలీవుడ్ లో జరగబోయే మొదటి పెళ్లి కియారా-సిద్దార్థ్ లదే అంటున్నారు.
కియారా అద్వానీ-సిద్దార్థ్ లు మొదట్లో గోవా లో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ.. ప్రస్తుతం అయితే వీరి పెళ్లి వేదిక చండీగఢ్ కి మార్చినట్లుగా తెలుస్తుంది. కారణం సిద్ధార్థ్ పంజాబీ కుటుంబ సాంప్రదాయం నేపథ్యంలో పెళ్లి వేదిక గోవా నుండి చండీగఢ్ కి మారినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా ల పెళ్లి ఏర్పాట్లని ఇరు కుటుంబాల వారు మొదలు పెట్టారని, త్వరలోనే కియారా అద్వానీ-సిద్దార్థ్ ల పెళ్లి తేదీ ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరి కియారా-సిద్దార్థ్ మల్హోత్రా ల పెళ్లి ఏ ఓటిటిలో వీక్షించాల్సి వస్తుందో..
ప్రస్తుతం కియారా అద్వానీ సౌత్ లో రామ్ చరణ్ RC15 లో నటిస్తుండగా.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది.