Advertisementt

NBK108: లాంఛింగ్ డేట్‌కున్న విశేషమిదే!

Mon 12th Dec 2022 07:58 AM
balakrishna,nbk108 movie,launch,balakrishna marriage day,  NBK108: లాంఛింగ్ డేట్‌కున్న విశేషమిదే!
NBK108 Launching Day Is Prestigious Day to Balayya NBK108: లాంఛింగ్ డేట్‌కున్న విశేషమిదే!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలయ్య.. ఏ పని చేసినా ఖచ్చితంగా ముహుర్తం ప్రకారమే చేస్తుంటారు. ఆయన ఏ టైమ్ అంటే.. ఆ టైమ్‌కి ఆ పని జరిగిపోవాలి. అంత పర్ఫెక్ట్‌గా ఆయన పంచాగాన్ని ఫాలో అవుతుంటారు. తాజాగా అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాకు సంబంధించిన చిత్రాన్ని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 36 నిమిషాలకు సినిమాని ప్రారంభించారు. డిసెంబర్ 8.. ఈ డేట్‌కి మరో విశిష్టత కూడా ఉంది. బాలయ్య లైఫ్‌లో మరిచిపోలేని రోజుది. బాలయ్య లైఫ్‌లో ఎంతో విశిష్టమైన రోజున సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం.. ఆయన సినిమా ఫంక్షన్స్‌లో చెప్పినట్లుగా యాదృచ్ఛికంగా జరిగిందో.. లేదంటే ఆ పైవాడు నిర్ణయించాడో తెలియదు కానీ.. ఈ డేట్ మాత్రం బాలయ్య లైఫ్‌లో నిజంగా మరిచిపోలేని రోజు. అదేంటంటో.. బాలయ్య పెళ్లి రోజు.

 

ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నుండి బాలయ్య, వసుంధరల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1982 డిసెంబర్ 8వ తేదీన పగలు 12 గంటల 41 నిమిషాలకు నందమూరి నటసింహంకు పెళ్లి జరిగినట్లుగా ఇందులో ఉంది. పెళ్లి కూతురు తరపు శుభలేఖ ఇది. ఈ శుభలేఖ బయటికి వచ్చినప్పటి నుంచి బాలయ్య ఏది చేసినా.. దాని వెనుక ఏదో ఒక విశేషం ఉంటుందనేలా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదండోయ్.. సినిమా ప్రారంభమైనందుకు, అలాగే పెళ్లి రోజు కూడా అయినందుకుగానూ.. బాలయ్యకు డబుల్ ధమాకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

NBK108 Launching Day Is Prestigious Day to Balayya:

NBK108 Movie Launch in Balayya Marriage Day

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ