Advertisementt

కన్నడలో నిషేధంపై రష్మిక రియాక్షన్

Mon 12th Dec 2022 08:56 AM
rashmika mandanna,kannada cine industry,kantarana,ban in kannada,heroine rashmika  కన్నడలో నిషేధంపై రష్మిక రియాక్షన్
Rashmika Mandanna Reacted on Kantara Issue కన్నడలో నిషేధంపై రష్మిక రియాక్షన్
Advertisement
Ads by CJ

రష్మిక మందన్నా.. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హీరోయిన్. సినిమా సినిమాకి స్టార్‌డమ్ పెంచుకుంటూ బాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన ఈ భామపై కొన్ని రోజులుగా ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ సినీ పరిశ్రమలో రష్మికపై హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. కన్నడ సినిమాల విషయంలో ఆమె వ్యవహరిస్తున్న తీరుని, తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడి చిత్రం ‘కాంతార’పై ఆమె స్పందించకపోవడాన్ని కొందరు వేలెత్తి చూపిస్తూ.. రష్మికకు కృతజ్ఞతాభావం లేదనేలా ఆరోపణలు చేస్తూ.. నిషేధం విధించాలనేలా కొందరు చర్చలు జరుపుతున్నారు.

 

ఈ వార్తలని, చర్చలని గమనించిన రష్మిక.. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ లేఖను విడుదల చేసి.. అందులో తన మొర వినిపించింది. అయినా కూడా బ్యాన్ వార్తలు ఆగలేదు. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో బ్యాన్ అనే వార్తలపై డైరెక్ట్‌గా రష్మిక రియాక్ట్ అయింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెను.. ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా.. బ్యాన్ వార్తలను ఆమె ఖండించింది. ‘కాంతార’ సినిమా విషయంలో కొందరు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ సినిమా చూశాక.. నేను చిత్ర బృందానికి పర్సనల్‌గా మెసేజ్ పెట్టాను. నా వ్యక్తిగత విషయాలను, నా ఫోన్‌లోని మెసేజ్‌లను బయటకు చెప్పాల్సిన, చూపించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మా మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో.. అది మాత్రం బయటికి చెబుతాను. అంతే తప్ప.. అన్నీ బయటికి షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు.. అని రష్మిక చెప్పుకొచ్చింది. 

Rashmika Mandanna Reacted on Kantara Issue :

Rashmika Mandanna Reaction on Ban in Kannada Cine Industry Allegations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ