Advertisementt

పవన్, ఎన్టీఆర్.. ఎవరు చేసినా హిస్టరీనే!

Mon 12th Dec 2022 09:30 AM
c kalyan,godse,pawan kalyan,jr ntr,satyadev,producer c kalyan  పవన్, ఎన్టీఆర్.. ఎవరు చేసినా హిస్టరీనే!
C Kalyan Sensational Comments on Godse Movie పవన్, ఎన్టీఆర్.. ఎవరు చేసినా హిస్టరీనే!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీరిద్దరిలో ఎవరు ‘గాడ్సే’ చిత్రం చేసినా.. ఆ సినిమా చరిత్ర సృష్టించేదని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. డిసెంబర్ 9 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఆయన ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో.. తను నిర్మించిన ‘గాడ్సే’ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదని.. ఆయన నిరాశను వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఆ సినిమా విషయంలో.. ముఖ్యంగా హీరో విషయంలో వేరే వారిని పెట్టాలని అనుకున్నానని, కానీ అప్పటికే హీరో ఫిక్స్ అవడంతో ఏమీ చేయలేకపోయానని తెలిపారు. ఈ సినిమాపై ఆయన మాట్లాడుతూ.. 

 

‘‘గాడ్సే సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. అది మంచి సినిమానే. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా.. థియేటర్లలో చూడలేదు. థియేటర్లలో రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశామేమో. అయితే ఆ కథని మోయగలిగే ఆర్టిస్ట్ కావాలి. ఈ సంగతి దర్శకుడికి కూడా ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ చేసేశాం. ఆ కథని, అందులో ఉన్న కంటెంట్‌ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే ఇద్దరు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండవ హీరో జూ. ఎన్టీఆర్. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా.. గాడ్సే హిస్టరీ క్రియేట్ చేసేది. బాగా చదువుకున్నా.. ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్, అలాగే వారి తల్లితండ్రులందరికీ ఈ సినిమా రీచ్ అవుతుందని భావించాం. కానీ అవ్వలేదు. గాడ్సే రిజల్ట్ చూసి చాలా బాధపడ్డాను. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీపడకుండా తీశాం. ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో చేసిన సినిమా ‘గాడ్సే’. కానీ వర్కవుట్ కాలేదు..’’ అని సి. కల్యాణ్ చెప్పుకొచ్చారు.

C Kalyan Sensational Comments on Godse Movie:

Had Pawan Kalyan or NTR acted, Godse would have created history

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ