Advertisementt

వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ

Fri 09th Dec 2022 11:09 AM
balakrishna,vasundhara devi,balakrishna wedding card  వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ
Balakrishna wedding card viral వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ వసుంధరాదేవి ని 1982 లో వివాహం చేసుకున్నారు. నందమూరి తారకరామారావు-బసవతారకంల ఐదవ కుమారుడు బాలకృష్ణ కి కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యారావు-ప్రమీల రాణిల ద్వితీయ కుమార్తె వసుంధరాదేవినిచ్చి 8-12-1982 బుధవారం పగలు 12.41 నిమిషాలకి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధానమున కర్ణాటక కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం చేసారు. తాజాగా బాలకృష్ణ-వసుంధరాదేవిలా వివాహ శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 1982 లో ఒక్కటైన బాలయ్య-వసుంధరాదేవిలా పెళ్లి రోజు డిసెంబర్ 8. 

దానితో నందమూరి అభిమానులు బాలయ్య పెళ్లి పత్రికను ఇలా వైరల్ చేస్తూ హడావిడి చేశారన్నమాట. బాలయ్య దంపతులకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రహ్మణికి తన అక్క కొడుకు లోకేష్ నిచ్చి వివాహం చెయ్యగా, రెండో కుమార్తెని బిజినెస్ మ్యాన్ కిచ్చి వివాహం చేసినా అతను రీసెంట్ గానే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇక బాలయ్య వారసుడు వెండితెర అరంగేట్రంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో.. నందమూరి వారసుడిని హీరోగా చూసెయ్యాలనే అభిమానుల ఆత్రుత ఎక్కువవుతున్న కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమవుతుంది. కొద్దిరోజుల్లో మోక్షజ్ఞ హీరో గా తెరంగేట్రం చేసే అవకాశం అయితే ఉంది.

Balakrishna wedding card viral:

Balakrishna-Vasundhara Devi wedding card went viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ