థియేటర్స్ లో సక్సెస్ అయినా, ప్లాప్ అయినా ఓటిటిలోకి వచ్చేముందు ఎంతో కొంత హడావిడి ఉంటే తప్ప ఆ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రారు. థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలను అంతే పబ్లిసిటీ తో ఓటిటిలో రిలీజ్ చేస్తున్న రోజులు ఇవి. కానీ కొంతకాలంగా అమెజాన్ ప్రైమ్ వారు కొంటున్న సినిమాలు ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న కాంతారని ఓటిటి డేట్ ఇవ్వకుండానే.. దాన్ని ఓటిటిలో రిలీజ్ చేసారు. ఇక తాజాగా సమంత యశోద మూవీని సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ నుండి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు.
థియేటర్స్ లో సమంత ప్రమోషన్స్ లేకపోయినా.. ఆమె స్టామినాతో యశోదని విజయతీరానికి చేర్చింది. సమంత మాయోసైటిస్ తో బాధపడుతున్న కారణంగా యశోద మూవీకి సింపతీ వర్కౌట్ అయ్యింది. అలాగే యశోద ని ప్రేక్షకులు ఆదరించడంతో సినిమా సూపర్ హిట్ కాకపోయినా.. నిర్మాతలకి ఎంతో కొంత లాభాలు తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాని ఓటిటిలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. ఓటిటిలో రిలీజ్ అని ఎంతో కొంత ప్రమోషన్స్ చేసినట్టయితే బావుండేది అనేది కొంతమంది ఆడియన్స్ ఫీలింగ్.
కానీ అమెజాన్ వారు యశోదని డిసెంబర్ 8 అర్ధరాత్రి నుండి అంటే డిసెంబర్ 9 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇంత సైలెంట్ గా అన్ని భాషల నుండి ఎలాంటి హడావిడి లేకుండానే ఓటిటిలోకి వచ్చేసింది సమంత యశోద.