బిగ్ బాస్ సీజన్ సిక్స్ చివరి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కానీ.. వోటింగ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులు రోజుకొకరిని డేంజర్ జోన్ లో కూర్చోబెడుతున్నారు. రేపు ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ఊహాగానాలు నడుస్తున్నాయి. టాప్5 లో 5 గురు ఉంటారు కాబట్టి ఇద్దరు ఈ వారం బయటికి వెళ్లే అవకాశం గట్టిగా ఉంది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోల్పోయిన ప్రైజ్ మనీ ని పెంచుకోవడానికి రకరకాల టాస్క్ లు పెడుతున్నారు. దానిలో భాగంగా బిగ్ బాస్ హౌస్ కన్ఫెషన్ రూమ్ లో దెయ్యాలు టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో ఆది రెడ్డి-శ్రీహన్ రచ్చ రచ్చ చేసారు.. మేము చనిపోతే మా శవాలను తీసుకెళ్లండి అంటూ అది రెడ్డి, శ్రీహన్ లు బెదిరిపోయారు.
అలాగే శ్రీ సత్యని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మంటే నేను రాను, నాకు భయం అంటూ గోల చేసింది. దానితో ఆమె ప్రైజ్ మనీ కాపాడలేకపోయింది. అక్కడ రేవంత్ కి శ్రీసత్యకి గొడవైంది. తర్వాత ఇనాయ ధైర్యంగా వెళ్లినా అక్కడ ఆ చీకటి గదిలో భయపడింది. ఇక రేవంత్ అయితే ధైర్యంగా అడుగుపెట్టి సూర్య కప్ పట్టుకొచ్చేసాడు. ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీ సత్యని ముందు ఆ డార్క్ రూమ్ లోకి పంపి భయపెడుతూనే తర్వాత కీర్తిని వెళ్ళమన్నాడు. ఆ రూమ్ లో దెయ్యం వేషాలతో శ్రీ సత్యని కీర్తిని బిగ్ బాస్ భయపెట్టేసాడు.
పాములు వేస్తూ వీరిద్దరికి చుక్కలు చూపించడమే కాదు, హౌస్ మేట్స్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మనగానే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ హంగామా చేశారు. ఇది చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి భలే టార్చర్ చూపెట్టాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.