జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకి సమాయత్తమవుతున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటల తూటాలను ఎదుర్కోవడానికి వైసిపి మంత్రులు చాలామంది రంగంలోకి దిగాల్సి వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర లో ప్రజా యాత్రకి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి ఆయనొక వాహనాన్ని స్పెషల్ గా రెడీ చేయించుకుని దానికి వారాహి అని పేరు పెట్టారు. అది జనసైనికులు వైసిపి పై యుద్దానికి సింబల్ గా ఆర్మీ వాహనాల రంగు తో వారాహి వాహనం రంగు పోలి ఉంది. పవన్ కళ్యాణ్ తన వాహాన్ని ఎప్పుడైతే పరిచయం చేసారో.. వైసిపి నేతలు రంగంలోకి దిగిపోయారు. పేర్ని నాని, కోడలి నాని వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు.
తాజాగా మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు కాదు సెటైర్స్ వేసింది. అది వారాహి వాహనం కాదు, నారాహి వాహనమంటూ చంద్రబాబు-పవన్ కళ్యాణ్ దోస్తీలే అని ఇండైరెక్ట్ గా పంచ్ వేసింది. అంతేకాకుండా ఆ వాహనంతో ఎవరి సైన్యంలో చేరి యుద్దానికి వస్తున్నారో చెప్పాలి, పిచ్చి పిచ్చి ట్వీట్స్ చెయ్యడం కాదు, తమ వారాహి వాహనంపై వైసిపి వారు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదు, మీకు అనుకూల మీడియానే మీ గురించి బయటపెట్టింది.
స్వతహగా ఆర్మీ జవాన్ల వాహనాలకు ఆ కలర్ వాడతారని అన్నాము అంటూ పవన్ పై ఆయన వాహనంపై రోజా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.