Advertisementt

చెన్నై ఆసుపత్రిలో శరత్ కుమార్

Sun 11th Dec 2022 09:49 AM
actor sarathkumar,chennai hospital  చెన్నై ఆసుపత్రిలో శరత్ కుమార్
Sarathkumar admitted Chennai hospital చెన్నై ఆసుపత్రిలో శరత్ కుమార్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతతో చెన్నై ఆసుపత్రిలో చేరారు. డయేరియా, డీ హైడ్రేషన్ తో బాధపడుతున్న శరత్ కుమార్ ని కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ప్రస్తుతం డాక్టర్స్ శరత్ కుమార్ ని అబ్జర్వేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. శరత్ కుమార్ దగ్గర ఆయన భార్య రాధికా అలాగే కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు.

ప్రస్తుతం శరత్ కుమార్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకి ప్రమాదం ఏమి లేదని, త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ సూచిస్తున్నారు. శరత్ కుమార్ నటుడిగా, అలాగే రాజకీయాలతో బిజీగా వుండే వ్యక్తి. శరత్ కుమార్ తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనపడుతున్నారు. త్వరగా కోలుకుని రావాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Sarathkumar admitted Chennai hospital:

Actor Sarathkumar Admitted To Hospital In Chennai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ