Advertisementt

ప్రభాస్ తో పాటు ఆహా షోలో ఆ ఇద్దరూ..

Sun 11th Dec 2022 10:24 AM
prabhas,jayasudha and jayaprada,unstoppable with nbk season 2  ప్రభాస్ తో పాటు ఆహా షోలో ఆ ఇద్దరూ..
Prabhas to grace Unstoppable With NBK season 2 ప్రభాస్ తో పాటు ఆహా షోలో ఆ ఇద్దరూ..
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్త చూసిన ప్రభాస్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన్ని ఆహ్వానిస్తూ ఆహా షో జరిగే చోట ప్రభాస్ బ్యానర్ లు వేసి హడావిడి చేసారు వారు. ఈ క్రేజీ ఎపిసోడ్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రభాస్ తో పాటుగా బాలయ్య అన్ స్టాపబుల్ షో కి ఆయన స్నేహితుడు హీరో గోపీచంద్ కూడా రాబోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్-గోపీచంద్ లతో పాటుగా సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద కూడా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై జయసుధ, జయప్రదలు కెరీర్, అలాగే రాజకీయ జీవితాలపై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల ముచ్చట్లతో పాటుగా, ఆయన పర్సనల్ లైఫ్ ప్రశ్నలు, కృష్ణరాజుగారి విషయాలు ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయాలు ఈ షోలో రివీల్ అయ్యే ఛాన్స్ ఉన్న కారణంగా డార్లింగ్ ఎపిసోడ్ పై ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, ఇంకా అశేష ప్రేక్షకజనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలతో ఆట పట్టిస్తారో అంటూ నందమూరి అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ పై ఆసక్తి చూపిస్తున్నారు,

ప్రభాస్ ఎపిసోడ్ ఈ రోజు ఆదివారం షూట్ చేసి.. డిసెంబర్ 16 అవతార్ రిలీజ్ సందర్భంగా ఆహా లో స్ట్రీమింగ్ చేస్తే బావుంటుంది అనే ఆలోచనలో ఆహా టీమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Prabhas to grace Unstoppable With NBK season 2:

Jayasudha and Jayaprada to grace Unstoppable With NBK season 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ