Advertisementt

రౌడీ విజయ్‌ను మళ్లీ ఏసుకున్న బండ్ల!

Fri 23rd Dec 2022 11:06 AM
bandla ganesh,vijay deverakonda,tweet,vijay devarakonda,parents,bandla satire  రౌడీ విజయ్‌ను మళ్లీ ఏసుకున్న బండ్ల!
Bandla Ganesh Satire on Vijay Deverakonda రౌడీ విజయ్‌ను మళ్లీ ఏసుకున్న బండ్ల!
Advertisement
Ads by CJ

గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ స్టేజ్‌పై మాట్లాడుతూ.. ‘బాబు ఎవరో తెలియదు, తాత ఎవరో తెలియదు.. అయినా నేనంటే ఎందుకింత పిచ్చో అర్థం కావడం లేదు’ అంటూ అభిమానులను ఉద్ధేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్‌పై బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా విజయ్‌కి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్, చరణ్, ప్రభాస్‌ వంటి వారిలా.. గుర్తుపెట్టుకో బ్రదర్’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమైంది. అప్పటి నుంచి బండ్లకు, విజయ్ అభిమానులకు మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా సోషల్ మీడియాలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండను బండ్ల గణేష్ కెలికేశాడు.

 

తాజాగా హైదరాబాద్ వెదర్‌ని ఆశ్వాదిస్తూ.. విజయ్ దేవరకొండ ఓ పిక్ పోస్ట్ చేశారు. అందులో.. తన ఇంటి లాన్‌లో తన తండ్రితో కలిసి కాఫీ తాగుతూ సరదాగా ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ పిక్‌లో తన తండ్రి ఎదురుగా విజయ్ కాలు పెట్టాడు. అది బండ్ల గణేష్‌కు నచ్చలేదు. విజయ్ పోస్ట్ చేసిన పిక్‌కి.. తను తన తండ్రికి క్రాఫ్ చేస్తున్న పిక్‌ని జతచేసి.. ‘మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు.. వారిని ప్రేమించడం పూజించడం మన ధర్మం’ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరో ట్వీట్‌లో ‘తల్లిదండ్రులను గుర్తు చేసుకునేలా పిక్ పెట్టినందుకు.. థ్యాంక్యూ విజయ్ దేవరకొండ’ అని తెలిపాడు. మొత్తంగా చూస్తే.. ఏసుకోవడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా? అని.. ఈ రౌడీని బండ్ల బాగానే ఫాలో అవుతున్నాడనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతోంది.

Bandla Ganesh Satire on Vijay Deverakonda:

Bandla Ganesh Tweet on Vijay Deverakonda goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ