Advertisementt

బాలయ్య స్టయిల్ కి ప్రభాస్ షాక్

Mon 12th Dec 2022 01:34 PM
unstoppable 2,balakrishna,prabhas,gopichand  బాలయ్య స్టయిల్ కి ప్రభాస్ షాక్
Unstoppable 2: Balakrishna, Prabhas,Gopichand blast బాలయ్య స్టయిల్ కి ప్రభాస్ షాక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా ప్రేక్షకులకి ఓ అభిమాన హీరో కాదు, ఓ బాహుబలి. బాహుబలితో ఇండియా వైడ్ గా ఫ్యాన్ బేస్ పెంచుకుని క్రేజీ హీరోగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ప్రభాస్ ఒక్కసారి కనిపిస్తే చాలు ధన్యమనుకునే లెవెల్ కి ఫాన్స్ వచ్చేసారు. రాధేశ్యామ్, సాహో సినిమాలు ప్లాప్ అయినా, ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు అందుకోలేంతగా ఉన్నాయి. అలాంటి స్టార్ హీరో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి వస్తే.. అమ్మో ఆ క్రేజ్, ఆ అంచనాలు కొలమానంలో కొలవడం కూడా కష్టమే. ఇప్పుడదే జరుగుతుంది. నిన్న ఆదివారం ప్రభాస్-బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో షూట్ జరక్కకముందునుండే ప్రభాస్ ఫాన్స్ చేసిన హంగామా అంత ఇంతా కాదు. ప్రభాస్ పోస్టర్స్, బ్యానర్ లు వేసి నానా రచ్చ చేసారు.

ఈ షోలో ప్రభాస్ తో పాటుగా ఆయన ఫ్రెండ్ గోపీచంద్ కూడా వచ్చాడు. ఇక బాలకృష్ణ కెరీర్ లో బెస్ట్ గా ఈ అన్ స్టాపబుల్ షో నిలిచిపోవడం కాదు, బాలయ్యని అన్ని రకాల యాంగిల్స్ లో చూపించిన ఈ షో పై అభిమానులు ఎంతో క్రేజీగా ఉన్నారు. ఆయన స్టయిల్ కి ఫిదా, ఆయన వాక్చాతుర్యానికి ఫిదా, ఆయన అల్లరికి ఫిదా, ఆయన హంగామాకి సందడికి ఫిదా.. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. ప్రభాస్ తో బాలయ్య షో ఎలా ఉండబోతుందో.. జస్ట్ పిక్స్ వదిలి చూపించారు. బాలకృష్ణ కళ్ళజోడు ఎగరేస్తున్న స్టయిల్ కి ప్రభాస్ ఆశ్చర్యపోతున్న పిక్ తో పాటుగా, గోపీచంద్-ప్రభాస్ ల స్నేహం ఈ షోలో హైలెట్ అవుతుంది అంటూ ఆ స్టిల్స్ లో చూపించారు.

మరి ఈ షోలో ప్రభాస్ తన ప్రేమ విషయాలు బయటపెడతాడని ఆయన అభిమానులే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటుగా ఇండియన్ వైడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై అందరూ ఆతృతగా కనబడుతున్నారు.

Unstoppable 2: Balakrishna, Prabhas,Gopichand blast:

Unstoppable 2 pics of Balakrishna, Prabhas, and Gopichand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ