నరేష్-పవిత్ర లోకేష్ పై సోషల్ మీడియాలో నడుస్తున్న దారుణమైన ట్రోలింగ్ తో విసిగిపోయిన పవిత్ర లోకేష్ తనపై, నరేష్ పై జరుగుతున్న ట్రోలింగ్, తమపై అసభ్యకరమైన రాతలతో ఇబ్బంది పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసారు. అలాగే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కొంతమంది వెంక ఉండి.. తమపై తప్పుడు ప్రచారం చేయిస్తుంది అంటూ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్ సైట్స్ పై ఆమె కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీస్ లు 12 మందిపై కేసు నమోదు చేసారు.
తాజాగా తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. నరేష్ ఈ రోజు సోమవారం నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. నరేష్ యూట్యూబ్ ఛానల్స్, అలాగే సదరు ఛానల్స్ ఓనర్స్ 12 మందిపై పరువు నష్టం దావా వేశారు. ఆ 12 మందిపై విచారణ చేపట్టాలని కోర్టుని కోరడంతో.. నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిని విచారించాలని కోర్టు పోలీస్ లని ఆదేశించింది. నరేష్ కంప్లైంట్ ఇచ్చిన ఇమండి రామారావు, రెడ్ టివి, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, రమ్యరఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, దాసరి విజ్ఞాన్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్, కృష్ణ కుమార్, మిర్రర్ టివి ఛానల్స్ కి పోలీస్ లు నోటీసు లు ఇచ్చారు.
ఇప్పుడు నరేష్, పవిత్ర లపై తప్పుడు ప్రచారం చేసినందుకు గాను ఆ 12 మంది విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీస్ లు వారికీ నోటీసు లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.