Advertisementt

వామ్మో దీపికా.. పిచ్చ లేపేసిందిగా!

Sun 25th Dec 2022 09:31 AM
besharam rang,pathaan,shah rukh khan,deepika padukone  వామ్మో దీపికా.. పిచ్చ లేపేసిందిగా!
Besharam Rang Song From Pathaan Creates Heat in Industry వామ్మో దీపికా.. పిచ్చ లేపేసిందిగా!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్లకు బికినీ కొత్తేం కాదు. అసలు బికినీ సంస్కృతి పుట్టిందే మా దగ్గర అన్నట్లుగా.. ప్రతి సినిమాలో అక్కడి హీరోయిన్లు బికినీలతో దర్శనమిస్తుంటారు. ఇప్పుడా బికినీలోనే ఇంకో రేంజ్‌ ప్రదర్శనకి దారి చూపింది బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ చేస్తున్న చిత్రం ‘పఠాన్’. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం య‌ష్‌రాజ్ ఫిల్మ్స్‌పై సిద్ధార్థ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 2023 జనవరి 25వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ అనే సాంగ్‌ని విడుదల చేశారు. 

 

ఈ సాంగ్‌లో దీపికా పదుకొనే.. బికినీని మించిన ట్రీట్ ఇచ్చింది. షారూఖ్ చిత్రాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడింది లేదు. అసలు ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో తెలియనంతగా మారిపోయాయి. ఈ చిత్రం ఆయనకి చాలా ప్రతిష్టాత్మక చిత్రం. ఖచ్చితంగా హిట్టవ్వాలి.. లేదంటే షారూఖ్ ఇక పేరుకే తప్ప.. హీరో అని ఎవరికీ గుర్తుండరు. అందుకే.. దీపికాతో వీర లెవల్‌లో రొమాన్స్ చేస్తూ.. ఈ పాటతోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడా? అని కూడా ఈ పాట చూస్తుంటే అనిపిస్తుంది. దీపిక ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేస్తూ.. అబ్బో వర్ణించడానికి వీలులేనంతగా, వీలు కానంతగా ఇద్దరూ ఈ పాటలో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ పాట ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం మరీ దిగజారిపోతుంది బాలీవుడ్ ఇండస్ట్రీ అంటూ చురకలు అంటిస్తున్నారు. 

Click Here for Song

Besharam Rang Song From Pathaan Creates Heat in Industry :

Pathaan Movie Besharam Rang Song Out 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ