Advertisementt

జబర్దస్త్ వాళ్ళని అందుకే పిలవలేదు: ఆర్పీ

Wed 14th Dec 2022 02:16 PM
kiraak rp,nellore pedda reddy chepala pulusu,jabardasth  జబర్దస్త్ వాళ్ళని అందుకే పిలవలేదు: ఆర్పీ
That's why Jabardasth didn't call them: RP జబర్దస్త్ వాళ్ళని అందుకే పిలవలేదు: ఆర్పీ
Advertisement
Ads by CJ

కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసాక జీ తెలుగు, స్టార్ మా ఛానల్స్ లో కామెడీ చేసాడు. అయితే జబర్దస్త్ నుండి వచ్చేసాక కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ పై హాట్ కామెంట్స్ చేసాడు. మల్లెమాల యాజమాన్యం వలన తాము చాలా నష్టపోయామని, తమకి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదంటూ జబర్దస్త్ అలాగే మల్లెమాల పై రకరకాల కామెంట్స్ చేసాడు. కారణం ఆయన మొదలు పెట్టిన సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కావాలనే  చెడగొట్టారని ఆర్పీ ఆరోపణలు.

అయితే రీసెంట్ గా కూకట్ పల్లిలో కిర్రాక్ ఆర్పీ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే హోటల్ ఓపెనింగ్ చేసాడు. ఈ హోటల్ ని సత్యానంద్ ఓపెన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ లాంటి వాళ్ళు ఈ ఓపెనింగ్ కి హాజరయ్యారు. అయితే ఈ ఓపెనింగ్ లో కిర్రాక్ ఆర్పీ ఫ్రెండ్స్ కానీ, జబర్దస్త్ బ్యాచ్ ఎవరూ కనిపించకపోవడానికి కారణం ఆర్పీ ని అడిగితే.. నేను కావాలనే జబర్దస్త్ వాళ్ళని ఎవ్వరిని పిలవలేదు, నా స్టేటస్ చూసి నేను హోటల్ ఓపెన్ చెయ్యడం చూసే ఉంటారు. నాకు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు కాబోయే భార్య లక్కీ నాకు హెల్ప్ చేసింది. ఇక జబర్దస్త్ ఫ్రెండ్స్ వలన నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు, కేవలం యాజమాన్యంతోనే నాకు ప్రాబ్లెమ్ అంటూ చెప్పాడు. 

అయితే ఆర్పీ మాత్రం జబర్దస్త్ లో ఎవరితోనూ ఫ్రెండ్ షిప్ చెయ్యడం లేదు అని, చమ్మక్ చంద్ర, వేణు లాంటి వాళ్ళ ఫ్రెండ్ షిప్ తోనే అతను ట్రావెల్ చేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ని అమీర్ పెట్.. ఇలా హైదరాబాద్ లోను పలు క్రేజీ ఏరియాలలో బ్రాంచెస్ ని ఓపెన్ చెయ్యాలని ఆర్పీ అనుకుంటున్నట్లుగా చెప్పాడు.

That's why Jabardasth didn't call them: RP:

Kiraak RP launches Nellore Pedda Reddy Chepala Pulusu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ