లైగర్ సినిమా డిసాస్టర్ తో నిర్మాతలు పూరి-ఛార్మీలు ఎంతగా నష్టపోయారో అనేది తెలియకపోయినా.. ఆ నష్టాల సమస్యలను ఎదుర్కోవాలో.. లేదంటే ప్రస్తుతం, లైగర్ టీమ్ పై ఈడీ చేస్తున్న ఆరోపణలకు బాధపడాలో, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ పెట్టె స్ట్రగుల్స్ ని తట్టుకోవాలో తెలియక పూరి జగన్నాథ్ సతమతమైపోతున్నాడు. లైగర్ పెట్టుబడుల విషయంలో రాజకీయనేతల హస్తంతో పాటుగా విదేశీ పెట్టుబడులు ఉన్నట్లుగా లైగర్ నిర్మాతలపైనే కాదు, హీరోపై లేటెస్ట్ గా ఫైనాన్సియర్ శోభన్ పై ఈడీ ఆరోపణల నేపథ్యంలో పూరి ఛార్మీలని ఒకరోజు విచారించిన ఈడీ అధికారులు, హీరో విజయ్ దేవరకొండకి నోటీసు లు ఇచ్చి అతన్ని పిలిపించి విచారించారు.
లైగర్ పెట్టుబడులు ఏ కోణంలో వచ్చాయో అన్న నేపథ్యంలో ఈడీ అధికారులు పూరి, ఛార్మి, విజయ్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసి దర్యాప్తు చేస్తున్నారు. హీరో రెమ్యునరేషన్, మిగతా నటుల పారితోషకాలు, పెట్టుబడి, రాబడి లెక్కలు, ఒకవేళ బడ్జెట్ కోసం ఫైనాన్స్ తీసుకున్నారా అన్న కోణంలో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇక నిన్న శుక్రవారం లైగర్ పెట్టుబడుల విషయంలో సినీ ఫైనాసీర్ శోభన్ ని ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కొన్ని గంటల పాటు శోభన్ ని ఈడీ అధికారులు విచారించినట్లుగా తెలుస్తుంది.
అయితే పూరి, ఛార్మి, విజయ్, శోభన్ ల విచారణల తర్వాత ఈడీ అధికారులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం గమనార్హం.