Advertisementt

కామెడీ మానేసి కర్రీ చేసుకుంటున్నాడు

Sat 17th Dec 2022 02:20 PM
kiraak rp,nellore pedda reddy chepala pulusu  కామెడీ మానేసి కర్రీ చేసుకుంటున్నాడు
Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu కామెడీ మానేసి కర్రీ చేసుకుంటున్నాడు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో కామెడీ ద్వారా ఫెమస్ అయ్యి తర్వాత నాగబాబు భజన చేసుకుంటూ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసి వేరే కామెడీ ప్రోగ్రాంలో కామెడీ చేసుకుని.. తర్వాత స్టార్ మా లో తేలాక జబర్దస్త్ యాజమాన్యం పై అక్కడ పెట్టే ఫుడ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కిర్రాక్ ఆర్పీ నిజంగా కిర్రాక్ గానే తయారయ్యాడు. మధ్యలో సినిమాని డైరెక్ట్ చేస్తా అని గొప్పగా చెప్పి తర్వాత ఆ సినిమాని ఆపేసాడు.

ఇక కామెడీ షోస్ మానేసి ఇప్పుడు కర్రీ పాయింట్ పెట్టడమే కాదు, కర్రీస్ వండుకుంటున్నాడు. కూకట్ పల్లి లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ హోటల్ ఓపెన్ చేసిన ఆర్పీ దానికి కావాల్సిన చేపల కూరను తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఓ వంటశాల ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ వంట మాస్టర్స్ తో కలిసి ఆర్పీ చేపల కూర వండడం అందరిని ఆకర్షించింది. కిర్రాక్ ఆర్పీ చేపలపులుసు హోటల్ పెట్టాడని తెలియగానే.. ఆయన వెంట యూట్యూబ్ ఛానల్స్ పడ్డాయి. 

ఆర్పీ వంట చేస్తున్న వీడియోస్ ని షూట్ చేసి మిలియన్ వ్యూస్ పట్టేస్తున్నారు. ఇక ఆర్డర్లు వచ్చినా చేస్తాను, నచ్చితే చేస్తాను, నెల్లూరు నుండి చేపలు తెప్పిస్తాను, చాలకపోతే ఆర్డర్లు ఎక్కువ ఉంటే.. ఇక్కడే చేపల చెరువులు దగ్గర కొంటాను, బొమ్మిడాయిలు, కోరమీను, రవ్వ లాంటి చేపలతో పులుసు పెడతాను అంటూ తన దగ్గర చాలామంది పని చేస్తున్నారంటూ ఆర్పీ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్నాడు.

ఇదంతా చూసిన నెటిజెన్స్ కిర్రాక్ ఆర్పీ కామెడీ మానేసి కర్రీ వండుకుంటున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu:

Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu hotel launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ