Advertisementt

పారితోషకం పై సీత హాట్ కామెంట్స్

Sun 18th Dec 2022 03:40 PM
sita ramam,mrunal thakur  పారితోషకం పై సీత హాట్ కామెంట్స్
Mrunal thakur Comments on Remuneration పారితోషకం పై సీత హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

సీతారామం మూవీలో సీత గా అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేసిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ లో సైలెంట్ గా కనబడుతుంది. సీతారామం తర్వాత మృణాల్ పేరు అన్ని భాషల్లో మోగిపోయింది. అదే రేంజ్ లో మృణాల్ కి అవకాశాలు కూడా వస్తాయని అన్నారు. కానీ మృణాల్ ఠాకూర్ కొత్త ప్రాజెక్ట్ సౌత్ లో సైన్ చేసిన దాఖలాలు లేవు. బాలీవుడ్ లోనూ ఇషాన్ కత్తర్ సిస్టర్ కేరెక్టర్ లో మృణాల్ ఓ ప్రాజెక్ట్ ఒప్పుకుంది.

ప్రస్తుతం సినిమాల విషయంలో సైలెంట్ గా ఉన్న సీత గారు హీరోయిన్స్ పారితోషకాల విషయంలో హాట్ కామెంట్స్ చేసింది. డిమాండ్ ని బట్టి హీరోయిన్లు పారితోషకం విషయంలో ఎక్కడా తగ్గకూడదు అని చెబుతుంది. ఆడియన్స్ లో యాక్టర్స్ కి ఉన్న క్రేజ్ ని బట్టి నిర్మాతలు హీరోయిన్స్ కి పారితోషకాలు నిర్ణయిస్తారు. కొంతమంది హీరోయిన్స్ తమకి కావాల్సిన పారితోషకాలని డిమాండ్ చేసే విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. అది మంచిది కాదు, తమకు కావాల్సింది డిమాండ్ చేసి అడగాలి.

మనకి ఎంత రెమ్యునరేషన్ కావాలో ముందే చెప్పాలి. అప్పుడే మనం మన వృత్తి పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో ఎదుటి వారికి అర్ధమవుతుంది.. అంటూ మృణాల్ ఠాకూర్ పారితోషకం విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Mrunal thakur Comments on Remuneration:

Sita Ramam Heroine Mrunal Thakur key comments on Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ