జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో కొద్దిరోజులు జబర్దస్త్ కి శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరమైన తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకుని జబర్దస్త్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంలో జబర్దస్త్ లోని ప్రతీ ఒక్కరు పంచ్ ప్రసాద్ కి సహాయం చేసారు. అయితే ఇప్పుడు మరో కమెడియన్ అత్యంత దీన పరిస్థితిలో ఉన్నాడు. అతనే చమ్మక్ చంద్ర స్కిట్స్ లో చేసే వినోద్ ఉరఫ్ వినోదిని. వినోద్ వినోదిని గా లేడీ గెటప్ వేసి చమ్మక్ చంద్ర స్కిట్ లో బాగా పాపులర్ అయ్యాడు. చంద్రకి సపోర్ట్ గా పంచ్ లు వేస్తూ లేడీ గెటప్ ని జబర్దస్త్ లో ఫెమస్ చేసిందే వినోద్. అలాంటి వినోద్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ ని వదిలేసినప్పుడు వినోద్ కూడా చంద్ర తో వెళ్ళిపోయి జీ ఛానల్, అలాగే స్టార్ మా లో కామెడీ చేసాడు.
అలాగే అతని పర్సనల్ లైఫ్ లో ఇంటి ఓనర్ తో గొడవ, బంధువుల అమ్మాయితో పెళ్లి విషయంలోనూ కాంట్రవర్సీ అయ్యాడు. అయితే ఇప్పుడు వినోద్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఇళ్ళు, కార్లు కొనుక్కుని మంచి పొజిషన్ లో ఉంటే వినోద్ మాత్రం చాలా చిన్న ఇంట్లో ఉన్నాడు. కారణం అతను ఇల్లు కొనుక్కుందామని 15 లక్షలు ఎవరికో ఇస్తే వాళ్ళు ఇల్లు ఇవ్వకుండా మోసం చెయ్యడం, అలాగే ఎవరికో తాను ష్యురీటి ఉండి 5 లక్షలు ఇప్పించగా వారు ఇవ్వకుండా వినోద్ ని ఇబ్బంది పెట్టడం, తర్వాత వినోద్ హెల్త్ ఇష్యుస్ తో చాలా డబ్బు హాస్పిటల్స్ కి వెచ్చించడం ఇలా అతను చాలా లాస్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు.
రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వూస్ లో తన పరిస్తితి చెప్పుకోగా.. హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో నీకు జబర్దస్త్ వాళ్ళు హెల్ప్ చేసారా అని అడిగితే.. జబర్దస్త్ ఫ్యామిలీ అంతా నన్ను ఆదుకుంది అని చెప్పాడు. మళ్ళీ జబర్దస్త్ కి అవకాశం వస్తే వెళతావా అనగానే వర్క్ ఉంది పిలిస్తే వెళ్తా అన్నాడు. కానీ ఆ యాంకర్ మల్లెమాల వాళ్ళు ఒక్కసారి జబర్దస్త్ వదిలి వెళ్ళాక మళ్ళీ నో ఎంట్రీ అంటారంట కదా అంటే.. అందుకే వర్క్ ఉంది పిలిస్తే వెళతాను అంటూ జవాబు ఇచ్చాడు వినోద్.