కెరీర్, ప్రేమ, పెళ్లి, విడాకులు, పాన్ ఇండియా యాక్ట్రెస్ గా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ నిత్యం ట్రెండ్ అయ్యే సమంత ఈమధ్యన అనారోగ్యం విషయంలో బాగా హైలెట్ అయ్యింది. మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం పబ్లిక్ లోకి రావడమే లేదు. సినిమా షూటింగ్స్ అస్సలే లేదు. మేకప్ కి దూరంగా ఉంటున్న సమంత సైలెన్స్ కి కారణం ఆమె వ్యాధే అయినా.. సోషల్ మీడియాలో సమంత పోస్ట్ ల కోసం ఆమె అభిమానులు బాగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకుంది. తనకి విపరీతంగా కోపం వచ్చినప్పుడు జిమ్ కి వెళ్లి ఎడా పెడా వర్కౌట్స్ చేస్తాను. అప్పుడు కోపం తగ్గిపోతుంది. తనకి డబ్బు ముఖ్యం కాదు, అలాగే పేరు ప్రఖ్యాతలు కోసం ఆరాటపడను. కానీ నాకు అన్నిటికన్నా ముఖ్యం నటనే అంటుంది. తాను చేసే ప్రతి పాత్రను ఆస్వాదిస్తానని, అప్పుడే అందులో సంతోషం ఉంటుంది. తనకి తానే పెద్ద క్రిటిక్ ని, తప్పొప్పులు గ్రహించగలిగితేనే కెరీర్ లో ఎదుగుతామంటూ సమంత చెప్పుకొచ్చింది.
కానీ టైమ్ బాగోకపోతే ఏది కలిసి రాదు. అప్పుడు బాధపడకుండా, ఆలోచించకుండా నిద్ర పోతానని, ఆ స్ట్రెస్ నిద్ర వలన దూరమవుతుంది, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. నువ్వు పుట్టింది వేరేవారి మెప్పుపొందడానికి కాదు అంటూ సమంత లైఫ్ అలాగే కేరీర్ లో ఎలా ఉండాలో, ఉంటానో చెప్పుకొచ్చింది.