గత బిగ్ బాస్ సీజన్5 లో టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ సిరి ఫ్రెండ్ షిప్ వలన చివరికి క్రేజ్ తగ్గిపోయి రన్నర్ గా మిగలడంతో.. అనూహ్యంగా వీజే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 కి విన్నర్ అయ్యాడు. లేదంటే సన్నీకి అసలు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. కేవలం షణ్ముఖ్ సిరి ఫ్రెండ్ షిప్ ని బిగ్ బాస్ ప్రేక్షకులు చూడలేకే వాళ్ళు షణ్ముఖ్ ని విన్నరవ్వకుండా చేసారు. లేదంటే నవ్వుతూ విన్నర్ అయ్యి బయటికి వచ్చేవాడు షణ్ముఖ్. చివరికి ముఖం మాడిపోయి రన్నర్ గా మిగలగా.. సన్నీ లక్కీ ఛాన్స్ కొట్టేసి విన్నర్ గా సీజన్ 5 ట్రోఫీ అందుకుని విజయ గర్వంతో బయటికి వచ్చాడు.
ఇప్పుడు సన్నీలానే సింగర్ రేవంత్ కూడా జస్ట్ కొద్దిపాటి అదృష్టంతో సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ ఫెవరెట్ గా ఉన్న రేవంత్ కి ఫ్రెండ్ శ్రీహన్ చివరిలో అనుకోకుండా ఇచ్చిన ట్విస్ట్ తో రేవంత్ టైటిల్ చేజారిపోయేదే. కానీ శ్రీహన్ వేసిన రాంగ్ స్టెప్, అతను టైటిల్ రేస్ నుండి మిడిల్ డ్రాప్ అవడంతో లక్కీగా సింగర్ రేవంత్ విన్నర్ అయ్యాడు. రేవంత్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఆడియన్స్ దెబ్బేసారు.
చివరిలో శ్రీహన్ కి పట్టం కట్టారు ఆడియన్స్. అటు శ్రీసత్య ఓట్స్ కూడా శ్రీహన్ కి చేరడంతో శ్రీహన్ విన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆడియన్స్ అంచనాలు శ్రీహన్ అందుకోవడంలో విఫలమై రన్నర్ అయితే ఏం మిగలదనే ఆలోచనతో 40 లక్షల సూట్ కేస్ కోసం ఆశపడడంతో అతనికి రావాల్సిన విన్నర్ టైటిల్ రేవంత్ చేతికి వచ్చింది. అదన్నమాట. అప్పట్లో సన్నీ లక్కీగా టైటిల్ ఎగరేసుకుపోగా.. ఇప్పుడు అదే అదృష్టం తో రేవంత్ బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందుకున్నాడు.