బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏదో అలా మొదలై ఇలా ముగిసింది. సీజన్ 6 ఎలాంటి క్రేజ్ గాను, ఉత్సాహం కానీ లేకుండా చాలా చప్పగా ముగిసిపోయింది. సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ లేకపోవడం, ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం, మిగతా సీజన్స్ కన్నా ఈ సీజన్ బోర్ కొట్టింది అంటూ బుల్లితెర ఆడియన్స్ గోల పెట్టేసారు. ఇక ఈ సీజన్ లోకి 21 మంది ఎంటర్ అవగా ఫైనల్ గా టాప్ 5 లో ఐదుగురు మిగిలారు. మొదటి రెండు వారాల్లో షాని, అభినయ ఎలిమినేట్ అవ్వగా.. తర్వాత వారం అనుకోకుండా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. స్ట్రాంగ్ అనుకున్న నేహా ఆలా వెళ్ళిపోయింది.
అయితే బిగ్ బాస్ లోకి వచ్చి వెళ్ళాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆమె. అనుకున్నట్టుగానే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న నేహా చౌదరి నిన్న ఆదివారం పెళ్లి చేసుకుంది. అది కూడా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో జాయిన్ అయ్యి అక్కడి నుండి నేరుగా ఆమె పెళ్లి పీటలెక్కడానికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి కంటెస్టెంస్ట్ తో పాటుగా హాజరయ్యి.. ఆ ఎపిసోడ్ షూట్ పూర్తికాగానే నేహా చౌదరి హైదరాబాద్ లో జరిగిన పెళ్లి కి వెళ్లి కాబోయే వాడు అనిల్ తో పెళ్లి పీటలెక్కింది.
నేహా చౌదరి అలా బిగ్ బాస్ నుండి నేరుగా పెళ్ళిపీటల మీదకి వెళ్లడం మాత్రం సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. ఇక నేహా చౌదరి-అనిల్ పెళ్ళికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది హాజరై హడావిడి చేసారు.