మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB28 సెకండ్ షెడ్యూల్ అలా అలా జనవరి మొదటి వారానికి షిఫ్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ అయినప్పటికీ.. ఆ షెడ్యూల్ షూట్ పనికిరాదని, ఆ మొదటి షెడ్యూల్ మరోసారి చిత్రీకరించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. మహేష్ బాబు కూడా మొదటి షెడ్యూల్ పై అసంతృప్తిగా ఉండడంతో త్రివిక్రమ్ రీ షూట్ కె మొగ్గు చూపారట. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ షెడ్యూల్ నుండి పూజ కూడా SSMB28 సెట్స్ లోకి రాబోతుంది.
సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తుంది కానీ.. త్రివిక్రమ్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరోపక్క త్రివిక్రమ్ సీనియర్ నటీమణుల విషయంలో కొత్తగా ఆలోచిస్తారని, నదియా, ఖుష్బూ లాంటి పాత్రల విషయంలో చూసాం. ఇప్పుడు మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా బాలీవుడ్ భామని దింపేందుకు ఏర్పాట్లు చేసుకుటనున్నారట. SSMB28 లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీని సంప్రదించబోతున్నారట త్రివిక్రమ్. అక్కడ మంచి పాపులారిటీ ఉన్న రాణి ముఖర్జీ అయితే SSMB28 కి వెయిట్ పెరుగుతుంది అని త్రివిక్రమ్ భవిస్తున్నారట.
రాణి ముఖర్జీ గనక ఓకె అయితే SSMB28 ని హిందీలో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి తెలుగు, తమిళ్, హిందీ అంటూ మిగతా కన్నడ, మలయాళ భాషల్లోనూ SSMB28 రిలీజ్ అవడం పక్కగానే కనబడనుండి. ఒకవేళ కీలక పాత్ర గనక రాణి ముఖర్జీ ఒప్పుకుంది అంటే మహేష్ ఫాన్స్ కి పండగే.