పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్స్ లోనే ప్రశాంత్ నీల్ సలార్ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతీ సినిమా షూటింగ్ తో పాటుగా, సలార్-ప్రాజెక్ట్ K షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.. సలార్ మూవీ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రభాస్ తో తలపడబోయే విలన్ గా కనిపిస్తున్నారు.
తాజాగా పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. వచ్చే నెల జనవరిలో తాను సలార్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాను అని, తనది విలన్ పాత్రే అయినా.. ప్రశాంత్ నీల్ ఆ పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారని, ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జరుగుతుందని కూడా పృథ్వీ రాజ్ చెప్పేసారు. ఇప్పటికే పృథ్వీ రాజ్ సలార్ లుక్ మాస్ ఆడియన్స్ ని పిచ్చెక్కించింది. ప్రభాస్ vs పృథ్వీరాజ్ ఊహించేకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.
సలార్ మూవీ ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 న రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.