Advertisementt

అజిత్ తునివు తెలుగు టైటిల్ వచ్చేసింది

Wed 21st Dec 2022 05:00 PM
thunivu,thegimpu,telugu  అజిత్ తునివు తెలుగు టైటిల్ వచ్చేసింది
Thunivu as Thegimpu అజిత్ తునివు తెలుగు టైటిల్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో తెరకెక్కే చాలా సినిమాలు అదే పేరుతొ తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. కానీ కొంతమంది హీరోలు మాత్రం తమిళంలో ఓ టైటిల్ తెలుగులో ఓ టైటిల్ పెట్టి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి తమిళం నుండి తెలుగుకి రాబోతున్న విజయ్ వారిసు చిత్రం తెలుగులో వారసుడిగా రిలీజ్ కాబోతోంది. అదే విధంగా మరో హీరో అజిత్ నటించిన తునివు చిత్రానికి తెలుగు టైటిల్ పెట్టేసారు. తెలుగులో తెలుగు టైటిల్ తో అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అజిత్ తునివు చిత్రం తెలుగులో తెగింపు గా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రస్తుతం తమిళనాట అజిత్ vs విజయ్ అన్న రేజ్ లో ఫాన్స్ కలయబడుతుంటే.. ఇక్కడ తెలుగు సినిమాలు vs తమిళ సినిమాలు అన్న రేంజ్ లో కొట్లాట జరుగుతుంది. తెలుగులో వీరసింహ రెడ్డి, వాల్తేర్ వీరయ్యలు సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. వాటి మీద పోటీగా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అజిత్ నటిస్తున్న తెగింపు చిత్రంలో ఆయన లుక్స్, అలాగే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. 

తాజాగా విడుదల చేసిన తునివ తెలుగు టైటిల్ తెగింపు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Thunivu as Thegimpu :

Thunivu as Thegimpu In Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ