Advertisementt

SSMB28 - NTR30 కలిస్తే..

Thu 22nd Dec 2022 09:53 AM
thaman,anirudh ravichandran  SSMB28 - NTR30 కలిస్తే..
Thaman And Anirudh To Perform Together On Stage SSMB28 - NTR30 కలిస్తే..
Advertisement
Ads by CJ

SSMB28 కి త్రివిక్రమ్-మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న మూవీ. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పని చేస్తున్నాడు. ప్రస్తుతం SSMB28 సెకండ్ షెడ్యూల్ ప్లాన్ లో టీం ఉంది. జనవరి మొదటి వారం నుండి సెకండ్ సెహెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోనే మొదలు కాబోతుంది. అయితే అటు NTR30 ఇంకా మొదలు కాలేదు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ లో అనిరుధ్ అండ్ కొరటాల ఉన్నారు. కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పూర్తయ్యాకే ఎన్టీఆర్ ఇండియాకి వస్తారు.

అయితే SSMB28 మ్యూజిక్ డైరెక్టర్ థమన్-NTR30 మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలిసి కనబడితే మహేష్ ఫాన్స్ కి-ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆ కిక్కే వేరు. ఇప్పుడు అదే జరిగింది థమన్ అండ్ అనిరుధ్ కలిసి ప్రయాణిస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. #SSMB28 & #NTR30 ❤️‍🔥❤️‍🔥🎵🎵 A drive Finally 🏎️ అంటూ థమన్ అనిరుధ్ తో కలిసి ప్రయాణం చేస్తున్న పిక్ ని షేర్ చేసారు.

మరి SSMB28 మ్యూజిక్ కి ఎన్టీఆర్ 30 మ్యూజిక్ కి ఏమైనా లింక్ ఉంటుందా.. అంటే వీరు చెన్నై లో జరగబోయే వారిసు ఈవెంట్ లో కలిసి సందడి చెయ్యబోతున్నారు. ఆ ఈవెంట్ ని షేర్ చేసుకోబోతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరూ కలిసి ఇలా జర్నీ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ లో అనిరుధ్ వారిసు సాంగ్స్ పాడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కలయిక కలిసి స్టేజ్ పై కనిపిస్తే మ్యూజిక్ లవర్స్ కి పూనకాలే..

Thaman And Anirudh To Perform Together On Stage :

Sensational Music Directors To Take Everyone On A Drive !!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ