Advertisementt

బిగ్ బాస్ పూర్తయినా నాగ్ వదలట్లేదు

Thu 22nd Dec 2022 10:24 AM
bb jodi,nagarjuna  బిగ్ బాస్ పూర్తయినా నాగ్ వదలట్లేదు
Nagarjuna at BB Jodi grand launch episode బిగ్ బాస్ పూర్తయినా నాగ్ వదలట్లేదు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 గత వారమే పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా నాగార్జున హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా సీజన్ ని పూర్తి చేసారు. ఇప్పుడు సీజన్ 7 కి నాగార్జున హోస్ట్ చెయ్యనని చెప్పడంతో యాజమాన్యం మరో హీరోని వెతుకుతున్నారట. బాలకృష్ణ సీజన్ 7 కి హోస్ట్ గా చెయ్యొచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. అయితే నాగార్జున బిగ్ బాస్ పూర్తయినా ఇంకా స్టార్ మా ని వదల్లేదు. కారణం స్టార్ మా యాజమాన్యం నాగార్జునని BB జోడి గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కోసం గెస్ట్ గా ఆహ్వానించారు,

ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి నాగార్జున అతిధిగా రాధా, సదా, తరుణ్ మాస్టర్ జెడ్జెస్ గా బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన కంటెస్టెంట్స్ ని జోడిగా మార్చి BB జోడి డాన్స్ ప్రోగ్రాం ని శ్రీముఖి యాంకర్ గా మొదలు పెట్టబోతున్నారు. అఖిల్ - ఆశు రెడ్డి, భాను - రవి కృష్ణ, ఫైమా-సూర్య, వాసంతి-అర్జున్ కళ్యాణ్ ఇలా జంటలుగా విడదీసి BB జోడీని గ్రాండ్ గా మొదలు పెడుతుంది స్టార్ మా.

మరి బిగ్ బాస్ మోహాలని బిగ్ బాస్ లో మిస్ అయినా మళ్ళీ రెండు మూడు నెలలు స్టార్ మా లో వస్తున్న BB జాడీలో కనిపిస్తాయి. ఇక నాగార్జున గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి అలా గెస్ట్ గా వచ్చి మరోసారి కంటెస్టెంట్స్ ని ఆడుకున్నారు. అంతేకాకుండా నాగార్జున డాన్స్ పెరఫార్మెన్స్ హైలెట్ అవ్వగా రాధ తో కలిసి క్యూట్ గా స్వీట్ స్టెప్స్ వేశారు.

Nagarjuna at BB Jodi grand launch episode:

Grand Launch Of BB Jodi Starting 25Th Decembe

Tags:   BB JODI, NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ