Advertisementt

ఆస్కార్ రేసులోకి కాంతార

Thu 22nd Dec 2022 11:27 AM
rishab shetty,kantara,oscars  ఆస్కార్ రేసులోకి కాంతార
Kantara Movie To Enter Oscar Race ఆస్కార్ రేసులోకి కాంతార
Advertisement
Ads by CJ

కన్నడలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో గ్రామ దేవతలు, ఫారెస్ట్ కాన్సెప్టుతో తెరకెక్కి ఇండియా వైడ్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుని కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టించిన కాంతార మూవీ ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. వరాహ రూపం సాంగ్ తోనే కాంతార క్లైమాక్స్ ని రక్తి కట్టించిన రిషబ్ శెట్టి ఆ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా చేసాడు. జస్ట్ 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ కి వచ్చేసరికి 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. 2023లో ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను జనవరి 24న ప్రకటించబోతున్నారు. 

అయితే అద్భుతాలు సృష్టించిన కాంతారని నామినేషన్స్‌లో చేర్చాలంటూ మేకర్స్ ఆస్కార్ అకాడమికి అప్లికేషన్ పెట్టినట్టుగా నిర్మాత విజయ్ అధికారికంగా ప్రకటించారు. కాంతార కోసం మేము అకాడమీకి అప్లికేషన్‌ను పంపాము. దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన కాంతార కథని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించేందుకు ఇంకా సమయం ఉన్నందున అప్లికేషన్ పంపాము అంటూ ఆయన కాంతారని ఆస్కార్ బరిలో నిలిపేందుకు ఆశాభావంతో ఉన్నట్టుగా విజయ్ తెలిపారు.

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఆస్కార్ రేసులోకి వస్తుంది, అవార్డులు రివార్డులతో వరల్డ్ వైడ్ గా దూసుకుపోయిన ట్రిపుల్ ఆర్ కి, కాంతారకి సంబంధం లేదు. కానీ కాంతార మేకర్స్ ఆస్కార్ బరిలో దింపడానికి ట్రై చెయ్యడం మాములు విషయం కాదు. 

Kantara Movie To Enter Oscar Race:

Rishab Shetty Kantara sent for Oscars nomination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ