నయనతార ప్రస్తుతం కనెక్ట్ ప్రమోషన్స్ లో యమా బిజీగా వుంది. నయనతార మెయిన్ లీడ్ లో తెరకెక్కిన కనెక్ట్ చిత్రాన్ని విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ లో నిర్మించగా తెలుగులో యువీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేసారు. ఈ రోజు విడుదలైన కనెక్ట్ మూవీ ఇంటర్వ్యూలో భాగంగా నయనతార చాలా విషయాల్లో ఓపెన్ అయ్యింది. దర్శకనిర్మాతలు హీరోలని ఒకలాగా, హీరోయిన్స్ ని ఓ లాగా చూస్తారని, హీరోయిన్స్ ని ఈవెంట్స్ లో మూలాన కూర్చోబెడతారని మాట్లాడిన నయనతార.. గతంలో తన లుక్స్ విషయంలో ఓ హీరోయిన్ తనపై చేసిన కామెంట్స్ కి కౌంటర్ వేసింది.
తాను దర్శకులు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, డ్రెస్ విషయమైనా, మేకప్ ఏదైనా వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తాను. గతంలో ఓ హీరోయిన్ హాస్పిటల్ లో నా లుక్ పై విమర్శలు చేసిన విషయాన్ని ఓ వీడియో లో చూసాను. ఆ హీరోయిన్ ఎవరనేది నేను చెప్పను, ఆవిడ నేను హాస్పిటల్ సీన్ చేసినప్పుడు మేకప్ వేసుకుని లిప్ స్టిక్ వేసుకొని అందంగా ఉండడాన్ని తప్పుబట్టింది. అయితే సినిమాలు విషయంలో రెండు వ్యత్యాసాలు ఉంటాయి. అవి కమర్షియల్, రియలిస్టిక్ అనే చిన్న వ్యత్యాసం ఉంటుంది. రియలిస్టిక్ సినిమాల్లో లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
కానీ కమర్షియల్ సినిమాల్లో దర్శకుడు ఏ సీన్ అయినా స్టైలిష్ గా అందంగానే చూపిస్తారు.. అంటూ తన లుక్స్ విషయంలో కామెంట్స్ చేసిన హీరోయిన్ కి కౌంటర్ వేసింది నయన్. అయితే నయన్ కౌంటర్ వేసిన ఆ హీరోయిన్ ఎవరబ్బా అని నెటిజెన్స్ తెగ ఆలోచిస్తుంటే.. ఇంకెవరు గతంలో తమిళ నటి మాళవిక మోహన్ ఆసుపత్రి లుక్ విషయంలో మేకప్ వేసుకుని లిప్ స్టిక్ పెట్టుకుని తల దువ్వుకుని ఓ టాప్ హీరోయిన్ అందంగా కనబడింది. ఎంత కమర్షియల్ సినిమా అయినా అందులో కాస్త వాస్తవికత ఉండాలి అంటూ ఆమె మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తున్నారు నయన్ అభిమానులు.