స్టార్ హీరోల భార్యల్లో మహేష్ భార్య నమ్రత, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి, రామ్ చరణ్ వైఫ్ ఉపాసనలు నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి మాత్రం లో ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తుంది. చాలా అరుదుగా లక్ష్మి ప్రణతి ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఇక నమ్రత తన పిక్స్ ని, పిల్లల పిక్స్ ని, మహేష్ తో గడిపిన అరుదైన క్షణాలని ఫొటోస్ రూపంలో షేర్ చేస్తుంది. అటు స్నేహ రెడ్డి గ్లామర్ గా, ఓ హీరోయిన్ మాదిరి ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. అల్లు అర్జున్ తో కలిసి ఉన్న ఫొటోస్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
ఈమధ్యన స్నేహ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అన్న రేంజ్ లో గ్లామర్ షో మొదలు పెట్టింది. తరుచూ ట్రెండీ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. తాజాగా నమ్రత శిరోద్కర్ పింక్ డ్రెస్ లో కొత్త లుక్ లోకి మారిపోయింది. Pink is the new black 💗 @surilyg #Holiday2022 అంటూ తన స్టైలిష్ ఫొటోస్ ని షేర్ చేసింది. ఆమె అంటే గతంలో మోడలింగ్ చేసింది. మాజీ మిస్ ఇండియా, అలాగే సినిమాల్లో నటించింది. సో నమ్రత ఇప్పటికి ట్రెండ్ ని ఫాలో అవుతూ స్టైలిష్ గా రెడీ అవ్వడం నిజంగా సూపర్ అనే చెప్పాలి.
ఇక అల్లు అర్జున్ వైఫ్ తాజాగా మోడరన్ డ్రెస్ నుండి సారి లోకి వచ్చేసింది. సారీలోను పోతపోసిన దేవతలా అందంగా రెడీ అయ్యి ఫొటోలకి ఫోజులిచ్చింది. అల్లు అర్జున్ పక్కన లేకపోయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న స్నేహ రెడ్డి స్పెషల్ క్రీమ్ కలర్ మోడరన్ సారీ షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహేష్ భార్య నమ్రత-అల్లు అర్జున్ వైఫ్ స్నేహాల ట్రెండీ లుక్స్ మీ కోసం..