సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ నిన్న డిసెంబర్ 23 తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ లో ఆయన నివాసంలోనే కన్ను మూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. కైకాలతో అనుబంధం ఉన్న నటులు ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కైకాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పర్యంతమయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, హీరోలు పవన్ కళ్యాణ్, రాజశేఖర్, వెంకటేష్, మోహన్ బాబు, త్రివిక్రమ్, రాజేంద్ర ప్రసాద్ ఇలా పలువురు ప్రముఖులు కైకాల సత్యన్నారాయణ భౌతిక కాయానికి నివాళు అర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు శనివారం డిసెంబర్ 24 మధ్యాన్నం కైకాల అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగబోతున్నాయి. ఉదయం 11 గంటలకు అంతిమ యాత్ర మొదలు కాబోతుంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తుంది. మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ ఇంటి దగ్గరే ఆయన భౌతిక కాయానికి నివాళు అర్పిస్తున్నారు ప్రముఖులు.