అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో అల్లు అర్జున్-స్నేహ లు పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అల్లు అర్హ, ఆయన్ లకి తల్లితండ్రులయ్యారు. అత్తవారింట్లో స్నేహ బాగా మింగిల్ అయ్యింది. అల్లు అర్జున్ వైఫ్ గా మారాక స్నేహ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవడమే కాదు, హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే గ్లామర్ తో ఫొటో షూట్స్ చేయించుకుని వాటిని షేర్ చేస్తుంది. దానితో అల్లు స్నేహ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అన్న రేంజ్ లో ఆమె ఫోటో షూట్స్ పాపులర్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన పాపులారిటీ ఉన్న స్నేహ రీసెంట్ గా ఇన్స్టా లైవ్ లో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది.
అల్లు స్నేహని రకరకాల ప్రశ్నలతో ఆట పట్టించిన అభిమానులు 2023 లో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారా అని అడిగిన వారికి స్నేహ కొంటెగా సమాధానం ఇచ్చింది. అవాన్ తో కలిసి కిచెన్ లో వంట చెయ్యాలనుకుంటున్నట్లుగా చెప్పింది. ఏ ఫుడ్ ఇష్టమని అడిగితే.. తనకి ఇండియన్ ఫుడ్స్ అంటే ఇష్టమని, బిర్యానీ ఫోటో షేర్ చేసింది. అల్లు అర్జున్ మీకేమైనా నిక్ నేమ్ పెట్టారా అని అడిగితే.. దానికి స్నేహ రెడ్డి తన భర్త తనని క్యూటీ అని పిలుస్తాడని సమాధానం చెప్పింది.
అంటే అల్లు అర్జున్ తన భార్య క్యూట్ గా స్వీట్ గా క్యూటీ అని పిలుస్తారన్నమాట. నిజంగానే స్నేహ రెడ్డి క్యూట్ గానే ఉంటుంది కదా.