సమంత రౌత్ ప్రభు క్రిష్టియన్. ఆమెకి క్రిష్టమస్ అన్నా, న్యూ ఇయర్ అన్నా చాలా స్పెషల్. ఈ రెండిటిని సమంత చాలా స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఇంట్లోనే క్రిష్టమస్ ట్రీ పెట్టి క్రిష్టమస్ కి నెల రోజుల ముందు నుండే హడావిడి చేసేది. నాగ చైతన్య ని వివాహం చేసుకున్నాక కూడా చైతూ తో కలిసి క్రిస్టమస్ ట్రీ ని స్పెషల్ గా ప్రిపేర్ చేసేది. అలాగే చైతూ తో కలిసి క్రిష్టమస్ కి వెకేషన్స్ కి వెళ్లి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ వరకు అక్కడే ఎంజాయ్ చేసి వచ్చేది. కానీ ఈ ఏడాది సమంత నుండి ఎలాంటి సెలెబ్రేషన్స్ మోడ్ కనిపించడం లేదు.
ఆమెకి మాయోసైటిస్ వ్యాధి సోకడంతో ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉంది. అయితే సమంత కోలుకుంటుంది, ఆమె సంక్రాంతి తర్వాత షూటింగ్స్ కి హాజరవ్వబోతున్నట్టుగా ఆమె మేనేజర్ చెబుతున్నాడు. కానీ సమంత కోలుకున్నట్టుగా ఆమె ఓసారి సోషల్ మీడియా ద్వారా కన్ ఫర్మ్ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. యశోద ఇంటర్వ్యూలో డల్ గా కనిపించిన సమంత తర్వాత మళ్ళీ మొహం చూపించలేదు. కనీసం క్రిస్టమస్ ట్రీ కూడా ప్రిపేర్ చెయ్యలేదు.
దానితో ఆమె అభిమానుల్లో అనుమానం, ఆందోళన మొదలయ్యింది. సమంత ఆరోగ్యం కుదుటపడుతుంటే.. కనీసం క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ అయినా చేసుకోవాలి కదా, లేదా సోషల్ మీడియాలో విషెస్ అయినా చెబితే బావుంటుంది. అప్పుడే అభిమానులు శాంతిస్తారు.