విజయ్ దేవరకొండ ఈ మధ్యన చాలా డిఫ్రెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. లైగర్ వల్ల తన కెరీర్ కి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదని చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా లైగర్ రెమ్యునరేషన్ విషయంలో ఈడీ నోటీసులు అందుకుని విచారణకు హాజరయ్యాడు. ఫేమ్ ఉంటే ఇలాంటివి కామన్ అన్నాడు. ఇక ఏదో ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ తన ఉనికిని చాటుకుంటున్నాడు. లైగర్ డిసాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న కొద్దీ అది ఆలస్యమవుతుంది. జన గణ మన ఆగిపోయింది. మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు.
కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్స్ లో పాల్గొన్నాడు. నేడు క్రిష్టమస్ సందర్భంగా తన తల్లి తయారు చేసిన క్రిష్ట్మస్ ట్రీ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తల్లి-తండ్రి విజయ్ ఉన్న పిక్ ని షేర్ చేస్తూ క్రిష్టమస్ విషెస్ ని ఫాన్స్ తో పంచుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇలా హుషారుగా ఉండడం చూసిన ఫాన్స్ రౌడీ అన్నా నువ్ సూపర్ అన్నా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
డిసాస్టర్ వచ్చింది కదా అని దిగాలు పడకుండా ఇలా ఆక్టివ్ గా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ సరదాగా తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవ్వడం చాలా పాజిటివ్ విషయం అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.