నిన్న క్రిష్ట్మస్ సందర్భంగా సెలబ్రిటీస్ చాలామంది X మాస్ ట్రీ పెట్టి సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులని ఆనందపరిచారు. ఇక అక్కినేని ఫ్యామిలోకి సమంత ఎంటర్ అయ్యాక చైతు-సమంతలు క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ తో ఫ్యామిలీకి పార్టీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలిలో సమంత లేదు. అయినప్పటికీ అఖిల్ అండ్ అక్కినేని యూత్ మొత్తం శాంతా డ్రెస్ కలర్స్ లోకి మారిపోయి క్రిష్టమస్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న పిక్స్ ని అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
సుమంత్, సుశాంత్, సుప్రీత, అఖిల్ ఇంకా అక్కినేని కజిన్స్ ఉన్న ఈ పిక్ లో నాగ చైతన్య మిస్ అవ్వగా.. హీరో అడివి శేష్ కనిపించడం అందరిలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే గూఢచారి సినిమాలో అడివి శేష్ - సుప్రీత స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక శేష్ కి సుప్రీతకి మధ్యలో ఏదో నడుస్తుంది అనే టాక్ తో వారిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ అప్పట్లో ఆ రూమర్స్ ని శేష్ ఖండించాడు. మళ్ళీ ఇన్ని రోజులకి అక్కినేని ఫ్యామిలిలో అడివి శేష్ కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
అది కూడా సుప్రీత పక్కనే కూర్చుని ఆమెనే చూస్తుండగా.. ఉన్న పిక్ ఇప్పుడు హాట్ హాట్ గా హల్చల్ చేస్తుంది. అడివి శేష్ పక్కకి తిరిగి సుప్రీతని చూస్తున్న పిక్ ని చూసినవారు ఏంటి శేష్ కథ అంటూ ప్రశ్నిస్తున్నారు.