ఈ ఏడాది ఎన్నో పెద్ద సినిమాలు, ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి సక్సెస్ అయ్యాయి, కొన్ని అంచనాలు అందుకోలేక అలా మిగిలిపోయాయి. ఇక గత రెండుమూడు నెలలుగా పెద్ద చిత్రాలేవీ విడుదల కావడం లేదు. చిన్న, మీడియా బడ్జెట్ చిత్రాలే విడుదలవుతున్నాయి. గత వారం ధమాకా, 18పేజెస్ విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారం ఇయర్ ఎండ్ సెల్ అన్నట్టుగా చాలా చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆది సాయి కుమార్ టాప్ గేర్ ఒకటి. కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన ఆది సాయి కుమార్ ఈసారి హిట్ కొట్టేలా కనబడుతున్నాడు. ఆది సాయి కుమార్ టాప్ గేర్ ఈ నెల 30 న ఇయర్ ఎండ్, చివరి వారంలో రిలీజ్ కి రెడీ అయ్యింది.
దానితో పాటుగా చిన్న సినిమాలు వివిడుదలకు సిద్ధమవుతున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన లక్కీ లక్షణ్, అలాగే రాజయోగం, ఐశ్వర్య రాజేష్ డ్రైవర్ జమున, కోరమీను, తారకరత్న S5, దేవరకొండ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా.. ఓటిటి హాట్ స్టార్ నుండి అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై డైరెక్ట్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇంతేకాకుండా ఆహా ఓటిటి నుండి క్రేజీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రభాస్-బాలయ్య ల బాహుబలి ఎపిసోడ్ కూడా ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 30 నే స్ట్రీమింగ్ కాబోతుంది.