Advertisementt

బిగ్ బాస్ నాకు అన్యాయం చేసాడు: రేవంత్

Mon 26th Dec 2022 07:38 PM
bigg boss 6,winner revanth interview  బిగ్ బాస్ నాకు అన్యాయం చేసాడు: రేవంత్
Revanth Sensational Comments Bigg Boss బిగ్ బాస్ నాకు అన్యాయం చేసాడు: రేవంత్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి కాలు పెట్టినదగ్గరనుండి చాలా అగ్రెసివ్ గా ఆడుతూ కంటెస్టెంట్స్ గుండెల్లో నిద్రపోయిన సింగర్ రేవంత్ నోటి దురుసు వలన చివరికి బిగ్ బాస్ ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చేది. మొదటి వారం నుండి రేవంత్ నామినేషన్స్ లో ఉన్న ప్రతి వారం సపోర్ట్ చేసే ఆడియన్స్.. చివరి వారంలో శ్రీహన్ ని విన్నర్ ని చేసి రేవంత్ కి అన్యాయం చేసారు. కానీ శ్రీహన్ అమాయకంగా  40 లక్షల సూట్ కేస్ అందుకుని అక్కడ టైటిల్ లాస్ అవుతున్నాను అని గ్రహించలేకపోయి బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీని వదులుకోగా.. విన్నర్ అవుతానని కాన్ఫిడెంట్ తో సూట్ కేస్ అందుకోకుండా శ్రీహన్ వదిలెయ్యడంతో ట్రోఫీ అందుకున్న రేవంత్.. బిగ్ బాస్ నుండి ఇంటికొచ్చాక కొద్దిరోజులు ఇంటి దగ్గరే కూతురితో గడిపిన రేవంత్ తాజాగా న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 

ఆ ఇంటర్వూస్ లో తనకి బిగ్ బాస్ లో ఆది రెడ్డి, శ్రీహన్, రాజ్, శ్రీ సత్య, వాసంతిలు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పారు. అలాగే రాజ్ ఎవిక్షన్ ప్రీ పాస్ కి బలవ్వకపోతే టాప్ 3 లో ఉండేవాడని చెప్పడు. అయితే తనకి విన్నింగ్ ప్రైజ్ మనీ కేవలం పది లక్షలతో సరిపెట్టారని, అక్కడ తనకి అన్యాయం జరిగినా తర్వాత తనకి న్యాయం జరుగుతుంది అని తాను నమ్మాను అని చెప్పాడు రేవంత్. శ్రీహన్ అసలు ముందు డబ్బు తీసుకోను అని చెప్పాడు, కాని తనకేం అవసరాలున్నాయో 40 లక్షలు తీసేసుకున్నాడు. డబ్బు ఈరోజు కాకపోతే రేపు గెలుచుకోవచ్చు కానీ.. బిగ్ బాస్ విన్నర్ అవ్వలేమని చెబుతున్నాడు రేవంత్. 

అయితే గీతూ టాప్ 5 వరకు ఉంటుంది, ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాము, ఆమె రివ్యూయర్ కాబట్టి హౌస్ లో ఎలా ఉండాలో అనేది ఆమె జేడ్జ్ చేస్తుంది అనుకున్నాము. కానీ మీరలా ఆడండి, ఇలా ఆడండి ని అందరికి చెప్పి తాను ఎలిమినేట్ అయ్యింది అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన రేవంత్ తన కూతురు తనకి లక్కీ అని, ఆమె పుట్టగానే బిగ్ బాస్ ట్రోఫీ వచ్చింది, అలాగే రెండు మూడు షోస్ చేస్తే తనకు బిగ్ బాస్ లో పోయిన డబ్బు వచ్చేస్తుంది అని చెప్పాడు.

Revanth Sensational Comments Bigg Boss :

Bigg Boss 6 Winner Revanth Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ