ఎప్పుడూ క్రిష్టమస్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే సమంత ఈ ఏడాది క్రిష్టమస్ ని అస్సలు పట్టించుకోలేదు, కనీసం ఓ ట్వీట్ కూడా చెయ్యలేదు. కారణం ఆమె మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది గనక. సమంత మాయోసైటిస్ బారిన పడి చాలా కాలమైంది. ఆమె నటించిన యశోద విడుదల కన్నా ముందే సమంత ఈ వ్యాధి బారిన పడింది. అయితే ప్రస్తుతం హెల్త్ స్టేటస్ బయటపెట్టకుండా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్న సమంత.. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కొద్దిగా ముందుగానే అభిమానులకి మెసేజ్ చేసింది.
Function forward…
Control what we can!!
Guess it’s time for newer and easier resolutions.. ones that are kinder and gentler on ourselves.
God bless 🫶🏻
Happy 2023!!
అంటూ సమంత తన పిక్ ని షేర్ చేసింది. మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి, కొత్త, సులభమైన లక్ష్యాల్ని సాధించడానికి ఇదే సరైన సమయం, మనం సాధించగలమనే లక్ష్యాల్ని ముందే నిర్దేశించుకోండి. మీకు దేవుడి తోడు ఎప్పుడూ ఉంటుంది.. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023 అంటూ ట్వీట్ చేసింది, సమంత షేర్ చేసిన పిక్ లో ఆమె ఇంకా కోలుకోలేదని ఆమె నీరసం మొహం చూస్తుంటే అర్ధమవుతుంది. మరి పొంగల్ తర్వాత సమంత షూటింగ్ లో పాల్గొంటుంది అని ఆమె మేనేజర్ చెబుతూ వస్తున్నాడు..