Advertisementt

తల్లయినా వన్నె తరగని హీరోయిన్

Sat 31st Dec 2022 10:12 AM
alia bhatt,ranbir kapoor  తల్లయినా వన్నె తరగని హీరోయిన్
Alia Bhatt New Look goes viral తల్లయినా వన్నె తరగని హీరోయిన్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది పెళ్లి చేసుకుని వెను వెంటనే తల్లయిన అలియా భట్ పెళ్లి, ప్రెగ్నెంట్, డెలివరీ అన్ని సంచలనమే. తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడైన రణబీర్ ని ప్రేమించి పెద్దల అంగీరంతో పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచిన అలియా భట్ పెళ్లి తర్వాత కూడా షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ హడావిడి చేస్తున్న సమయంలోనే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించింది. పెళ్లి సింపుల్ గా సీక్రెట్ గా చేసుకున్న అలియా భట్.. పిల్లలని అంత త్వరగా కనేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

ప్రెగ్నెంట్ అని తెలిపిన కొద్ది నెలలకే ఆడపిల్లకి జన్మనిచ్చిన అలియా భట్.. ప్రెగ్నెన్సీ బరువు తగ్గించుకునే ప్రాసెస్ లో యోగా చేస్తుంది. బేబీ పుట్టకముందు ఒక నెల, పుట్టాక ఒక నెల రెస్ట్ తీసుకున్న అలియా భట్.. ఇప్పుడు రొటీన్ లైఫ్ లోకి వచ్చేసింది. అలియా భట్ రీసెంట్ గా అంబానీ ఇంట్లో జరిగిన నిశ్చితార్ధం వేడుకలో భర్తతో కలిసి మెరిసింది. అలాగే ఫోటో షూట్స్ స్టార్ట్ చేసింది. 

తాజాగా అలియా భట్ షేర్ చేసిన పిక్ చూస్తే తల్లయినా వన్నె తరగని హీరోయిన్ అనేలా అందంగా, ఆకర్షణగా కనిపించింది. మోహంలో గ్లో తో మెరిసిపోతున్న అలియా భట్ భర్తతో కలిసి 2022 ని మనసునిండా నింపుకుని.. ఈ ఏడాది తమ జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తులని పోగేసుకుని.. ఆనందంగా ఈ ఏడాదికి వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యారు అలియా-రణబీర్ దంపతులు.

Alia Bhatt New Look goes viral:

Alia Bhatt drops stunning new pictures

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ