నటి పవిత్ర లోకేష్ ని సీనియర్ నరేష్ నాలుగో పెళ్లి చేసుకుంటున్నారని ఎప్పటినుండో ప్రచారం జరగడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. నరేష్-పవిత్ర లోకేష్ లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రమే కాకుండా, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా నరేష్ పై, పవిత్రపై చిందులు తొక్కుతూ వాళ్ళని నెగెటివ్ చెయ్యడం, నరేష్-పవిత్రలు సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడం అన్ని 2022 లో పెద్ద డ్రామాగా నడిచింది. ఈమధ్యన కృష్ణ గారి భౌతిక కాయం దగ్గర నరేష్-పవిత్ర కలిసి ఉన్న విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
అయితే 2022 కి గుడ్ బై చెబుతూ 2023 న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతూ నరేష్ తన లైఫ్ లో జరగబోయే శుభకార్యాన్ని అనౌన్స్ చేసారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాను, కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులతో మేము త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామంటూ #PavitraLokesh అని హాష్ టాగ్ ని షేర్ చేసారు.
నరేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో నరేష్-పవిత్రలు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవడమే కాదు, పవిత్ర నరేష్ కి ముద్దు పెట్టడం హైలెట్ అయ్యింది. కొన్నాళ్లుగా వివాదాస్పదమైన వీరి బంధం ఇప్పుడు పెళ్లితో ముడిపడబోతుంది. బహుశా 2023 లో ప్రథమార్ధంలో నరేష్-పవిత్ర లోకేష్ లు ఏడడుగులు నడిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.