Advertisementt

నానితో సీత?

Sat 31st Dec 2022 06:24 PM
mrunal thakur,nani 30  నానితో సీత?
Sita Ramam beauty to romance Nani? నానితో సీత?
Advertisement
Ads by CJ

హీరో నాని.. అంటే సుందరానికి తర్వాత నిర్మాతగా హిట్ 2 తో హిట్ కొట్టి దసరా షూటింగ్ లో బిజీ అయ్యాడు. కీర్తి సురేష్ తో దసరా లో రొమాన్స్ చేస్తున్న నాని.. ఆ సినిమాని మార్చి లో రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు నాని న్యూ ఇయర్ రోజున తన కొత్త సినిమాని ప్రకటించబోతున్నాడు. Nani30 ని రేపు ఆదివారమే పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. మోహన్ చెరుకూరి-విజయేందర్ రెడ్డి నిర్మించనున్న.. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది.

అయితే ఈ చిత్రంలో నాని సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో రొమాన్స్ చేయనున్నాడని చెబుతున్నారు. సీతారామం లో క్యూట్ గా, సారీస్ లో సీత పాత్రలో మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ కి ఆ సినిమా సక్సెస్ ఊపునిచ్చింది. ఆ తర్వాత ఆమె వైజయంతి మూవీస్ లో మరో సినిమా చేస్తుంది అన్నప్పటికీ.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా Nani30  కోసం సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసారని.. రేపు ఆదివారం పూజాకార్యక్రమాలతో ఆమెని పరిచయం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Sita Ramam beauty to romance Nani?:

Mrunal Thakur to play female lead in Nani next?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ