Advertisementt

పవన్ ఫాన్స్ తో కలిసి అకీరా నందన్ హడావిడి

Sat 31st Dec 2022 08:46 PM
akira nandan,kushi,pawan kalyan  పవన్ ఫాన్స్ తో కలిసి అకీరా నందన్ హడావిడి
Akira Nandan date with his dad Kushi పవన్ ఫాన్స్ తో కలిసి అకీరా నందన్ హడావిడి
Advertisement
Ads by CJ

ఈమధ్యన స్టార్ హీరోల క్రేజీ బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ చేస్తూ మేకర్స్ హడావిడి చేస్తుంటే అభిమానులు రెచ్చిపోయి ఆ సినిమాలకు బ్యానెర్లు కట్టి, ఆయా హీరోల కటౌట్స్ కి పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. ఈ రోజు 2022కి చివరి రోజు డిసెంబర్ 31 న పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమా 4K రెజల్యూషన్ తో రీ రిలీజ్ తో ఫాన్స్ హంగామా మాములుగా లేదు. సినిమా వచ్చి 21 సంవ‌త్స‌రాలు అవుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గలేదు. అభిమానులు భారీ సంఖ్య‌లో ఖుషి రీ రిలీజ్‌ను 4K రెజ‌ల్యూష‌న్‌లో చూస్తూ విజిల్స్ వేసి పేపర్స్ చింపి భీబత్సం చేసారు.

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం జరిగింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తన తండ్రి ఖుషి మూవీని 4K రెజల్యూమిషన్ లో చూసేందుకు థియేటర్ కి రావడం. ఆయన పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో కలిసి సినిమా చూసినా.. ఆయనెవరో గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకుని వచ్చినప్పటికీ.. వెళ్ళేటప్పుడు సైలెంట్ గా బయటికి వెళ్ళిపోయినా కానీ కొంతమంది అకీరాని గుర్తు పట్టి హంగామా చేసారు.

అకీరా అలా తన తండ్రి ఖుషి సినిమాని అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తూ కామ్ గా బయటికి వెళ్ళిపోయినా.. సోషల్ మీడియా పసిగట్టేసి ఆ ఫొటోస్ ని వైరల్ చేసిపడేసాయి.

Akira Nandan date with his dad Kushi:

Akira Nandan enjoys Kushi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ