Advertisementt

పెళ్లి, పిల్లలపై అలియా భట్ హాట్ కామెంట్స్

Sun 01st Jan 2023 06:40 PM
alia bhatt,ranbir kapoor  పెళ్లి, పిల్లలపై అలియా భట్ హాట్ కామెంట్స్
Alia Bhatt hot comments on marriage and children పెళ్లి, పిల్లలపై అలియా భట్ హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఆలయ భట్ బాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్. అమ్మడుకి గత ఏడాది హాలీవుడ్ అవకాశం కూడా వచ్చింది. చేతినిండా సినిమాలు, సౌత్ ఎంట్రీ.. కెరీర్ ఇంత పీక్స్ లో ఉండగా ఇష్టపడిన రణబీర్ తో ఏడడుగులు నడవడమే ఓ సెన్సేషన్ అంటే.. అదే ఏడాది అలియా భట్ పిల్లలని కనడం మరింత సెన్సేషన్ అయ్యింది. కొన్ని ప్రాజెక్ట్స్ ని బేబీ బంప్ తోనే పూర్తి చేసిన అలియా భట్.. మరికొన్ని ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో పెట్టింది. ఇప్పుడు బేబీ పుట్టాక నాజూగ్గా మారడానికి వర్కౌట్స్ మొదలు పెట్టింది.

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా.. పెళ్లి, పిల్లలు కనడంపై అలియా భట్ హాట్ కామెంట్స్ చేసింది. తల్లయ్యి ఆ మాతృత్వాన్ని అనుభవించినప్పుడు, తనలోని మార్పులని పట్టించుకోను అని చెబుతుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంతేకాదు బిడ్డకి జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ పెళ్లి, పిల్లలు వలన సినిమా కెరీర్ లో మార్పులు జరుగుతాయని ఎవరు చెప్పారంటూ ప్రశ్నిస్తుంది. ఒకవేళ మార్పే జరిగితే జరగనివ్వమంటుంది. అలాంటి విషయాలను పట్టించుకోను.

పెళ్లి చేసుకోవాలనుకున్నాను, పిల్లలను కనాలని నిర్ణయించుకోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు. ఇది అందరికి జరిగే చాలా సహజమైన ప్రక్రియ. ఇది నేను లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటూ అలియా భట్ పెళ్లిపై, పిల్లలని కనడంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Alia Bhatt hot comments on marriage and children:

The best decision I took in life was marriage, children: Alia Bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ