నయనతార కి 2022 ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఆరేళ్ళ సీక్రెట్ పెళ్లి బంధాన్ని పబ్లిక్ గా పెళ్లి పేరుతొ సెలెబ్రేట్ చేసుకుని విగ్నేష్ శివన్ తో హ్యాపీగా హనీమూన్ అంటూ హడావిడి చేసిన నయనతార.. అదే ఏడాది సరోగసి ద్వారా కవల పిల్లలకి తల్లయ్యింది. 2022 ఏడాదిని తన కేలెండర్ లో తీపి గుర్తుగా మార్చుకున్న నయనతార రీసెంట్ గా నటించిన కనెక్ట్ మూవీ తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేసారు. ఆ మూవీకి సంబందించిన ప్రమోషన్స్ లో నయనతార చాలా విషయాలను రివీల్ చేసింది.
మూడు భాషల్లో విడుదలైన కనెక్ట్ మూవీ సక్సెస్ అవడం పట్ల చాలా సంతోషంగా ఉంది, ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ చేస్తున్నాను, కనెక్ట్ హిందీలో రిలీజ్ చెయ్యడానికి కారణం, కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి విడుదల చేసాం, సినిమా బావుంది కాబట్టే రిలీజ్ అయిన అన్ని చోట్లా హిట్ అయ్యింది అని చెప్పిన నయనతార తన 20 ఏళ్ళ కెరీర్ గురించి కూడా మాట్లాడింది.
సినిమా ఇండస్ట్రీలో ఇనాళ్ళు కొనసాగడం మాములు విషయం కాదు, నేను నా కెరీర్ లో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు అంతా బావుంది. ప్రస్తుతం నా సినీ ప్రయాణములో హ్యాపీగా ఉన్నాను అంటూ నయనతార ఈ కెరీర్ లో ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పింది. తనని ఇన్నేళ్లు ఆదరించిన అభిమానులకి నయనతార కృతఙ్ఞతలు చెప్పుకుంది.