నయనతార లేడీ సూపర్ స్టార్. మరింత లక్కీ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన నయన్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ప్రేమించిన ప్రియుడు విగ్నేష్ శివన్ తో ఏడడుగులు నడవడమే కాదు, ఇద్దరి పిల్లలకి తల్లయ్యింది. అందం చెడిపోకుండా, గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు సరోగసి ద్వారా తల్లయిన నయనతార గత ఏడాది ట్విన్స్ ని ఎత్తుకుంది. నయనతార-విగ్నేష్ శివన్ లు ప్రౌడ్ గా పేరెంట్స్ మయ్యామని చెప్పుకుని ఆనందించేలోపు వాళ్ళని వివాదాలు చుట్టిముట్టాయి. అయినప్పటి వివాదాలను దాటి ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు నయన్ దంపతులు.
ఈ న్యూ ఇయర్ కి నయనతార భర్త విగ్నేష్ నుదిటి మీద ముద్దు పెడుతూ. తన ఇద్దరి బిడ్డలని చేతుల్లో ఎత్తుకుని మైమరిచిపోతున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు విగ్నేష్ శివన్. ఆ పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. Picture perfect ❤ Nayan with her husband and Twin boys 🙂 అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.